• About Us
  • Contact Us
  • Our Team
Monday, September 14, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

తెలుగుప్రభ ‘కథవెనుక కథ’ శీర్షిక కింద 24 ఆగస్టు 2026న ప్రచురితం

admin by admin
August 24, 2026
0
సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

దుఃఖానికి రూపం ఇచ్చానని అనుకునే భ్రమ- ‘కడెవర్ భారతి’ కథ! రూపం ఇచ్చేశాను గనుక అది ఆగుతుందా? దుఃఖానికి ఘనీభవన స్థితి ఉంటుందా? లేదా, నిత్యం ద్రవీకరించేస్తూ నీలోని చైతన్యాన్ని, క్రియాశీలతను మొత్తంగా వెలుపలికి పోటెత్తించేస్తుంటుందా? ఒకవేళ ఉంటే, గట్టిపడే సమయం ఎంత? ఎన్నేళ్లు? ఈ జన్మ చాలుతుందా? గడ్డకట్టిన తర్వాత అది సంతరించుకునే బరువు ఎంత? మానవ హృదయం మోయగలుగుతుందా?
ఇన్ని ప్రశ్నలు మిగిలేఉన్నాయి. అయినా సాహసించి ఒక కథ రాయడానికి పూనుకున్నాను. నెమరు వేసుకుని రాయడానికి- అమ్మ జ్ఞాపకం కాదు. చైతన్యం. కథ కూడా అలాగే సాగిపోయింది. కానీ, కథను పూర్తి చేయడం ద్వారా నేను అనుకున్నది జరిగిందా?


అమ్మ ఉన్నపళంగా విశ్రాంతి తీసుకుంది. నేను సిద్ధంగా లేను. నాకు చిన్న సంకేతమైనా ఇచ్చి ఉండాల్సింది. అలాగని నేను అలవిమాలిన స్వార్థంతో కూడా లేను. నా జీవితపర్యంతమూ ఆమె నాకూ, నా అభ్యాగతులకూ కాఫీ టీలు కాస్తూ, ఏ ఒక్కరోజూ వేళ మీరకముందే- ఇంటర్‌కమ్ లో కాల్ చేసి ‘బువ్వ రెడీ, తీరినప్పడు రా’ అని పురమాయిస్తూ.. నా సేవల్లోనే స్థిరంగా, శాశ్వతంగా ఉండాలనే స్వార్థం నాకు లేదు. అనివార్యమైన ఇలాంటి సమయం ఆసన్నమైనప్పుడు ఏం చేయాలో మా ఇద్దరికీ తెలుసు. అనేకమార్లు చర్చించుకున్న మాటల సారంలో స్పష్టత ఉంది. ఆ ప్రకారం అన్నీ పూర్తిచేశాను. రేపటి డాక్టర్ల కార్యకుశలతలో, జ్ఞానంలో భాగం అయిపోవాలనుకున్న అమ్మను- మహావీర్ మెడికల్ కాలేజీ వారి విశ్రాంతి గృహంలో ఉంచేశాను.

ఆ అనుభవం అంత సులువుగా సాగిపోలేదు. తిట్టారు. తిట్టలేక ‘నీ యిష్టం’ అన్నారు. అసహ్యించుకున్నారు. గేలిచేశారు. వెలివేశారు. పెద్దగీత -చిన్న గీత సిద్ధాంతం మనిషికి అతి గొప్ప ఊరట, ఉపశమనం. ఇవేమీ నన్ను కించిత్తు బాధించలేదు. కానీ అమ్మ స్వేచ్ఛ గురించి, ఇచ్ఛా ప్రస్థానం గురించి రాయాలనిపించింది. అదివరలో అలాంటి దుఃఖాన్నే రాసిన అనుభవం ఉంది. నేను ఎంతగానో ప్రేమించే ఒక స్నేహితురాలి తండ్రి దుర్మార్గపు పరిస్థితుల్లో సెలవు తీసుకుంటే.. కుదురుగా ఉండలేక రాసినది అది. అలాంటిది కథ అవుతుందో కాదో అనే సంశయంలో కొన్ని నెలలు ఇనప్పెట్టెల్లో దాచేసి, తర్వాతెప్పుడో ‘సారంగ’కు పంపితే.. అఫ్సర్.. కథగానే గుర్తించారు. చదివిన కొందరు సహానుభూతి చెందారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పని చేయాలి.

వేరే ఏ కూలిపనులూ చేతకానందువల్ల ‘రాత’ను నేను ఎంచుకోలేదు. బతుకుతెరువు గనుక యిష్టపడ్డానో, యిష్టం గనుక బతుకుతెరువుగా మార్చుకున్నానో చెప్పగల రేఖ ఎన్నడో చెరగిపోయింది. రాయడం తప్ప బరువు దించుకునే మార్గం మరొకటి తెలియదు. అప్పటికీ, కట్టలు తెంచేసిన అనేక దుఃఖమయ క్షణాలను, పొందికగా అక్షరాల్లోకి అనువదించి అవి ‘కవితలు’ అనుకున్నాను. అవికూడా చదివిన వారికి నా దుఃఖాన్ని పంచాయి. ‘పూర్ణమదం పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’- మాటలు వర్ణించేది పరమాత్మ గురించి అని ఎవరైనా అంటే నమ్మకండి. ఒక్కొక్కరి అనుభవంలో ఒక్కొక్క తీరుగా వ్యక్తమైనది మాత్రమే పరమసత్యం! నా అనుభవంలో అవి ‘దుఃఖం’ గురించే. పంచినంత మాత్రాన ఆ బరువు తగ్గిపోలేదు. ఇంకాస్త పెద్దప్రయత్నంగా పూనుకుంటే పుట్టింది ‘కడెవర్ భారతి’!

సుమారుగా అయిదు శాతం వాక్యాలు మినహా కల్పన జోలికి వెళ్లలేదు. అవి కూడా సంఘటనల క్రమాన్ని అతికించడానికి వాడినవి మాత్రమే. అమ్మ, నేను, చాలామంది మిత్రుల ఆలోచనలకు ప్రతినిధిగా నన్ను నిలదీసిన ఒక స్నేహితురాలు, తమ నమ్మకాలతో నిమిత్తం లేకుండా నాతో నిలిచిన ఆప్తులు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదేనని నమ్మే సహచరులున్న అమ్మ కుటుంబం, అసహ్యించుకున్నవాళ్లు, వెలివేసిన వాళ్లు.. వెరసి రాయడానికి ప్రేరణను, స్ఫూర్తిని అందించారు. పాత్రలు కూడా వాళ్లే. ‘కడెవర్ భారతి’ని కథగా ఆంధ్రజ్యోతి వాళ్లు ఆమోదించారు. పేజీలలో డిజైన్ చేసిన తర్వాత, ప్రింటింగ్‌కు పంపేముందు చల్లా శ్రీనివాస్ ఫోను చేశారు. ‘కడావెర్’ అని ఉచ్చరించాలట కదా- అనే సందేహం వెలిబుచ్చారు. నాకు మా పోరంకి వారి సూత్రీకరణ గుర్తుకొచ్చింది. అది పరాయిభాష పదం. నిర్దిష్టమైన అక్షర కూర్పు తేల్చలేం. ‘గూగుల్‌ సాయంతో విన్న ఉచ్చారణను బట్టి అలా రాశా’నన్నాను. ఆయన మన్నించారు. కథ రూపంలో అమ్మ అందరి ఎదుటకు రాగలిగింది.

ఇది నా మనసు డైరీలోని పుటల పునర్నిర్మాణం. మన మొహం మనతో పాటు తుదికంటా ఉండేదే అయినా ఫోటోకు పటం కట్టి ఇంట్లో పెట్టుకుంటాం. నా దుఃఖం నాతో, నేను కడెవర్ అయ్యే క్షణాల వరకు, కొనసాగేదే అయినా నేను అక్షరాల్లో పుటం పెట్టి దాచుకున్నాను. నా సంజాయిషీగా, నా డిఫెన్సు వాదనగా, నా మాటల గారడీగా కూడా ఈ కథ ముద్రపడింది. ఇది నా స్టేట్‌మెంట్. కథలో చెప్పినట్టుగా ‘ముర్రుపాలలో మొండితనాన్ని అమ్మ నుంచి జుర్రుకున్న వాడిని!’ నేను. అంత సులువుగా జంకను. నీరుగారను.

‘అంతటా ఇదే జరుగుతోంది. లోకరీతిగా మారుతున్న దౌర్బల్యాలను ఇందులో భలే చెప్పారు’- అంటూ ప్రశంసలందుకునే కోవకు చెందిన కథలు కొన్ని ఉంటాయి. అందరెరిగిన సత్యాన్నే పునర్వచించి అందరినీ రంజింపజేసేవి. చాలా మంది ఊహకు అందని, చాలామంది ఆమోదించడానికి ఇష్టపడని సత్యాన్ని ప్రతిపాదించి.. చదివిన వారి బుర్రలలో, బుద్ధులలో ఒక కొత్త ఆలోచనను ప్రతిష్ఠించి- దానితో సంఘర్షించమని శాసించే కథలు కొన్ని ఉంటాయి. ఈ రెండో కోవకు సర్వజనామోదం ఉండదు. సమపాళ్లలో అభ్యంతరాలూ, తిరస్కారాలూ కూడా ఎదురవుతాయి. ‘కడెవర్ భారతి’ రెండో కోవకు చెందుతుందని నేను నమ్ముతాను.

అప్పటికప్పుడు కాదు గానీ, చాన్నాళ్లకు ఘనీభవనం కూడా జరిగింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా.. గడ్డకట్టడం కూడా నీరుగారడానికే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కాలం ఆ బరువును సుదీర్ఘంగా మోస్తున్న ఏదో ఒక సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. ‘పాతపత్రికలు తిరగేస్తుండగా చదివాను’ అంటూ ప్రారంభం అవుతుంది. ‘మాక్కూడా ఇలా చేయాలని ఉంది. ఎలా?’ అంటూ ప్రశ్న! వివరాలన్నీ చెబుతాను. ఆరుతున్న గాయం పువ్వులా విచ్చుకుంటుంది. ద్రవీభవనంలో తడుస్తాను.

వేల, లక్షల.. మేం జీవించిన క్షణాలలో.. ఒక్కోసారీ ఒక్కోదాన్నీ జ్ఞప్తికి తెచ్చే తలపోతలు తడిపే దుఃఖం అలవాటే! ఈ కథ ప్రత్యేకంగా, తను ప్రేరణ అందిస్తున్న వందలమంది అపరిచితులను మన దారిలోకి ఇంటర్‌సెప్ట్ చేయించి.. వారి ద్వారా మళ్లీ మళ్లీ తడుపుతోంది. తడుపు తడుపుల మధ్యలో బతుకు సాగిపోతోంది.

.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె
99594 88088
(‘కడెవర్ భారతి’ తొలి ప్రచురణ ఆదివారం ఆంధ్రజ్యోతి 7 డిసెంబరు 2025)

Tags: ak prabhakark a muni suresh pillaikatha venuka kathateluguprabhaఏకే ప్రభాకర్కథవెనుక కథతెలుగుప్రభ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply