ఆంధ్రప్రదేశ్ రాష్టంలో విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహఖ అధ్యక్షుడు తులసిరెడ్డి వాపోయారు. విజయవాడలో పత్రికా సమావేశంలో ఈ విధంగా ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం ఉన్నత విద్య ఉసురుతీస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగ విద్యార్ధులకు మెరుగైన కార్పొరేట్ విద్యను అందకుండా జగన్ ప్రభుత్వం చేస్తోందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో జగనన్న విద్యా దీపం జగనన్న శాపం అయిందని, నవరత్నాలు రూపుదిద్దుకోవాల్పిన విద్యార్ధులు గులకరాళ్లుగా పరివర్తన చెందారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 బడ్జెట్ లో ఉన్నత విద్యకు రూ.4962 కోట్లను కేటాయించగా, అందులో కేవలం రూ.1557 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
అలాగే 2020-21 బడ్జెట్ లో ఉన్నత విద్యకు కేటాయించింది. రూ.2277 కోట్లు మాత్రమేనని ఆయన అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77 ను రద్దు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
.

Discussion about this post