ఇప్పుడు పార్టీ మారిపోయాడు గనుక.. తిట్టిపోస్తున్నది. కానీ.. నిన్నటిదాకా నెత్తిన పెట్టుకున్న తీరుకు ప్రజలకు ఎలా సంజాయిషీ చెబుతుంది? ఎలా ప్రజలను నమ్మిస్తుంది. అందుకు కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టినట్టుగా ఉన్నది గానీ.. అలాంటి మెలికపేచీ మాటలు పెద్దగా లాభించవు.
ఎందుకంటే..సుబేంద్రు అధికారి.. నిన్నటిదాకా తృణమూల్ కాంగ్రెస్ లో కీలకమైన నాయకుడు. బెంగాల్ లో మారుతున్న పరిణామాలు.. బీజేపీ వ్యూహ చాతుర్యం.. అమిత్ షా రాజకీయ ఎత్తుగడలు.. వీటన్నింటి నేపథ్యంలో ఆయన టీఎంసీని వీడి.. కమలతీర్థం పుచ్చుకున్నారు. ఆయన పార్టీ ఫిరాయించడం అనేది ఒక రకంగా.. టీఎంసీకి పెద్ద దెబ్బగానే ఆ రాష్ట్రంలో పరిగణిస్తున్నారు. మమతా బెనర్జీ తర్వాత.. ఆ పార్టీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఆయన ఒకరు కావడమే అందుకు కారణం.
నిన్నటి దాకా, మమతా బెనర్జీ నెత్తిన పెట్టుకున్న సుబేంద్రు అధికారి ఇప్పుడు నందిగ్రామ్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి.. మమతా బెనర్జీ కూడా పోటీకి దిగారు. సుబేంద్రును కొత్తగా ఎలా తిట్టి.. ఓడించాలో మమతాకు అర్థమౌతున్నట్టు లేదు. అందుకే అక్కడ ఎన్నికల ప్రచారంలో తనను తాను తిట్టుకుంటున్నారు. ‘నేను పెద్ద గాడిదను. సుబేంద్రు అవినీతిని ఇన్నాళ్లూ తెలుసుకోలేకపోయాను..’ అని మమత అంటున్నారు.
కేవలం సుబేంద్రు మీద ప్రజల్లో మీద అనుమానం, వ్యతిరేకత క్రియేట్ చేయడానికి మమత తనను తాను తిట్టుకుంటూ సరిపోతుందా? సుబేందు అధికారి 5000 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం సృష్టించుకున్నారని ప్రజలు అంటున్నారు.. అనేది మమత మాట!
Read this also :
వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేస్తాం అంటున్న నాయకుడు
మమత ఆరోపణలే గనుక నిజమైతే.. దేశం మొత్తం ఫైర్ బ్రాండ్ గా పరిగణించే మమతా బెనర్జీ ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే ప్రజలు అనుకోవాల్సి వస్తుంది. ఆమె సీఎంగా ఉండగా.. ఆమె పార్టీలోని వ్యక్తి.. అక్రమంగా ఐదువేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించుకుంటే.. ఆమె గుర్తించకుండా ఉండిపోయినట్లే.. ఆమె మాటల అర్థం కనిపిస్తోంది. ఇదంతా ఆమె చేతగానితనం కాక మరేం అవుతుంది.
సుబేందుపై వేస్తున్న నిందల ద్వారా మమతా బెనర్జీ తన చేతగాని తనాన్ని, నీతిమంత పాలనలో తను విఫలమైన సీఎం అని తనకు తానే చాటుకున్నట్టుగా ఉన్నదని భావించాల్సి వస్తోంది.
.

Discussion about this post