కేంద్రంలోని మోడీ సర్కారు వ్యవహార సరళి పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధారణంగా చాలా చాలా మెతక వైఖరినే అవలంబిస్తున్నారనే ప్రచారం తొలినుంచి ఉంది. ప్రత్యేకించి.. కేంద్రంలోని పాలక పార్టీతో తగాదా పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప.. సాధారణంగా అందరూ కేంద్రంతో సత్సంబంధాలనే కోరుకుంటూ ఉంటారు. సీఎం జగన్ కూడా అలాగే చేస్తున్నారని అనుకోవచ్చు గానీ.. ఆయన మీద ఉన్న కేసుల కారణంగా.. కేసులను మాఫీ చేయించుకోడానికే జగన్ కేంద్రం వద్ద సాగిలిపడి, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనే ప్రచారం ప్రత్యర్థులనుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే.. జగన్ తాజాగా.. కేంద్రం తీరు పట్ల తన అసహనాన్ని వెలిబుచ్చారు.
వైఎస్సార్ బీమా విషయంలో కేంద్రం మోసం చేసిందన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తన వాటాగా చెల్లించాల్సిన ప్రీమియం విషయంలో అనేక మడత పేచీలు పెడుతున్నదని అయినా సరే.. రాష్ట్రప్రభుత్వమే పూనుకుని మొత్తం సొమ్ము చెల్లిస్తున్నదని ఆయన చెప్పడం విశేషం.
కేంద్రం పెట్టిన మడతపేచీ వల్ల రాష్ట్రలో 60లక్షల కుటుంబాలకు బీమా సదుపాయం కల్పించలేకపోయాం అంటూ సీఎం జగన్ చెప్పడం విశేషం. ప్రజల బీమాకు సంబంధించి జగన్ కేంద్రంపై వేర్వేరు ఆరోపణలు చేశారు.
read also
జాతీయ స్థాయిలో తెలంగాణకు అవార్డుల పంట
చేతులు దులుపుకున్న మోడీ సర్కార్
గతంలో బీమా ప్రీమియం మొత్తంలో 50 శాతం కేంద్రం చెల్లించేది. అయితే 2020 మార్చి 31 తర్వాత ప్రీమియం చెల్లించబోం అంటూ మెలికపెట్టారని.. అయినా సరే ప్రజలకోసం మొత్తం ప్రీమియంలు రాష్ట్రప్రభుత్వమే చెల్లించిందని జగన్ చెప్పుకొచ్చారు. గతంలో గ్రూపు బీమా ఉండగా.. ఇప్పుడు ప్రతి వ్యక్తి పేరిట ఇండివిడ్యువల్ ఖాతాలు తెరవాలనే నిబంధన రావడంతో.. చాలా ఇబ్బంది ఎదురైందన్నారు. రాష్ట్రంలో 1.31 కోట్ల కుటుంబాల్లో ఒకరి పేరునైనా ఖాతాలు తెరిపించేందుకు వాలంటీర్లు ఎంతగా పనిచేసినా.. 60లక్షల కుటుంబాల్లో అకౌంట్ ఓపెన్ చేయడం వీలుపడలేదన్నారు. అయితే ఆ కుటుంబాలకు చెందిన వారందరికీ ప్రభుత్వమే స్వయంగా బీమా మొత్తం చెల్లించడం విశేషం.
వారి కుటుంబాలనుంచి 12,039 మందికి సంబంధించి బీమా మొత్తం 254 కోట్ల రూపాయలను జగన్ విడుదల చేయడం విశేషం. ప్రజలకు బీమా విషయంలో ఇప్పటికే ఈ రెండు సమస్యలు ఉండగా.. కొత్తగా కూల్ ఆఫ్ పీరియడ్ అంటూ.. బీమా చెల్లించిన 45 రోజుల దాకా మరణించినా సరే.. చెల్లింపులేకుండా ఉండేలా కొత్త సమస్య వచ్చిందని కూడా జగన్ అన్నారు. ఈ సమస్యలను కలెక్టర్ల ఎదుట ప్రస్తావించి.. ప్రజలకు మేలు జరిగేలా ప్రాక్టికల్ పరిష్కారం ఏదైనా ఉంటే ఆలోచించి చెప్పాలని ఆయన కోరడం విశేషం.
.

Discussion about this post