కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అందించే పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంట పండింది. మూడు కేటగిరీలలో ఏకంగా 12 అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.
జాతీయ స్థాయిలో 9 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు లభించాయి. 2 ఉత్తమ మండల పరిషత్, 1 ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డులు కూడా తెలంగాణకు లభించాయి. కేంద్రం ప్రతి ఏటా ఇస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాలల్లో తెలంగాణ ఈ ఘనతను సాధించింది.
రాష్ట్రానికి ఇన్ని అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కృషి, ముందు చూపు, చొరవ, మార్గదర్శనం వల్లే ఈ అవార్డులు సాధ్యమయ్యాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ప్రతి ఏటా దేశంలోనే ఉత్తమ జిల్లా, మండల, గ్రామ పంచాయితీలుగా తెలంగాణ పల్లెలు ఎంపిక అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
A very proud moment for people of Mittapally and Mallyala villages of Siddipet for being awarded with National Dayal Swashakti Karan Awards.
My best wishes to the people, Sarpanches and the administrators of Mittapally and Malyala villages for their incredible work!
— Harish Rao Thanneeru (@BRSHarish) March 31, 2021
.