ప్రతినిత్యం వేలాదిమంది శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాలు అందించే తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం ఉదయం ఘనంగా ఆయుధపూజ నిర్వహించారు.
అన్నప్రసాదం డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ వంట సామగ్రికి, వంట పాత్రలకు, యంత్రాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి సంవత్సరమంతా నిర్విఘ్నంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరగాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ పూజ కార్యరక్రమంలో డెప్యూటీ ఈవో (రిసెప్షన్) లోకనాథం, పిఆర్వో డాక్టర్ టి. రవి, విజివో బాలిరెడ్డి, ఏఈవో గోపీనాథ్‌తో పాటు అన్నప్రసాద శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
.

Discussion about this post