తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 18వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు.
ఆ తర్వాత వరుసగా గర్భాలయం, ఉప ఆలయాల్లో దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.
.

Discussion about this post