సాక్షాత్తూ ప్రభుత్వాధినేత.. వారి మొల ఆలకించడానికి పూనుకున్న తర్వాత.. ఇక సుదీర్ఘంగా శషబిషలు కొనసాగడానికి వీల్లేదు. చిటికెలో వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసి ఉండాలి. ముఖ్యమంత్రి జగన్ తో చర్చకు కూర్చోవడమే.. తమ సమస్యకు పరిష్కారం అనుకునేంత స్థాయిలో ఉద్యోగ సంఘాల వారంతా చాలా ఆశగానే ఎదురుచూశారు గానీ.. చివరికి ఆయన కూడా ఏ సంగతి తేల్చలేదు. వేగంగా నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రిగా.. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి పీఆర్సీ డిమాండ్లను ఒక కొలిక్కి తేలేకపోయారు!
ఫిట్ మెంట్ పై మళ్లీ సస్పెన్స్. ఎంత ఇస్తారో తెలియదు. ఈ రోజు ఏదో ఒకటి తేలి పోతుందని ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే మిగిలింది. కాకపోతే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్ట మొదట సారిగా ఉద్యోగ సంఘాల నేతలతో గంటన్నరకు పైగా చర్చలు జరపడం.. వారి సమస్యలు వినడం వారిని సంతృప్తి పరచింది. రెండు, మూడు రోజుల్లో సానుకూల ప్రకటన వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆశిస్తున్నారు.
పేరివిజన్ కమిషన్‌తో పాటు 71 సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సుమారు రెండు మాసాలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌కు చెందిన 13 సంఘాల నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. వీరితో జగన్ సుదీర్ఘంగా చర్చించారు.
‘‘దయచేసి అందరూ ప్రాక్టికల్ గా ఆలోచన చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని.. ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తానని.. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని.. మంచి చేయాలన్న తపనతో తాను ఉన్నానని.. 2-3 రోజుల్లో పీఆర్సీ పై ప్రకటన చేస్తామని.. నేను మీ అందరి కుటుంబ సభ్యుడినని.. మీ సమస్యలు అన్నీ నోట్ చేసుకున్నానని.. ఎవరూ ఆందోళన చెందనక్కర లేదంటూ’’ ముఖ్యమంత్రి జగన్ భరోసా కల్పించారు.
read also : ఇదేంటి మోడీజీ .. వారేమైనా మీ హత్యకు ప్లాన్ చేశారా?
ఈ చర్చల్లో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఫిట్ మెంట్ 27శాతానికి తగ్గకుండా చూడాలని కోరగా.. మరో సంఘం నేత 34శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరారు. అంతకు మునుపు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శులు ఫిట్ మెంట్ ఎంత పెంచితే.. ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో సమావేశంలో వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి.. న్యాయం చేస్తామని.. రెండు, మూడు రోజుల్లో పీఆర్సీ పై ప్రకటన చేస్తామని జగన్ హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాల నేతలు సంతృపితో బయటకు వచ్చారు. అయితే ఈ హామీ జగన్ ఎంత వరకు నెరవేర్చుకుంటారోనని క్షేత్రస్థాయి ఉద్యోగులు అంటున్నారు. ఇంతకాలమూ నిరీక్షించామని.. మరో రెండు, మూడు రోజులు ఉంటే జగన్ ఏం చెబుతారో తేలిపోతుందని వారు అంటున్నారు. మొత్తానికి పీఆర్సీ పై ఈ రోజు ఏదో ఒకటి తేలి పోతుందని ఆశించిన సగటు ఉద్గోగి.. అది తేలక పోవడంతో అసంతృప్తిత వ్యక్తం చేస్తున్నాడు.
ఎందుకు తేల్చలేదు..
ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఏమిటో.. వారు ఎందుకోసం పట్టుపడుతున్నారో.. ప్రభుత్వపరంగా ఉన్న పరిమితులు అభ్యంతరాలు ఏమిటో ముఖ్యమంత్రికి ఇప్పటిదాకా తెలియదా? అనే సందేహం కలుగుతోంది. ఉద్యోగుల డిమాండ్లు ఇదివరకు కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు వారు మరోసారి వినిపించారంతే. ప్రభుత్వానికి ఉన్న కష్టాలు ఆర్థిక శాఖ అధికారులు ఇదివరలోనే సీఎంకు బ్రీఫ్ చేసి ఉన్నారు.
కాకపోతే.. ఇవాళ ఆ ప్రహసనం మొత్తం మరోసారి తంతులాగా జరిగినట్టు కనిపిస్తోంది. అందుకే రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి మెత్తబడే ధోరణిలో ఉంటే.. ఈ రోజు వారితో చర్చల్లోనే ఆ సంగతి కనిపించి ఉండేదని కొందరు, ఎంత చెడ్డా ముఖ్యమంత్రి వరకు వెళ్లిన తర్వాత.. అధికారులు నిర్ణయించిన ఫిట్‌మెంట్ వద్దనే ఆగకపోవచ్చునని కొందరు అంచనా వేస్తున్నారు.
.

Discussion about this post