తిరుమల ఘాట్ రోడ్డు పనులను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు.
ఘాట్ రోడ్డు మరమ్మత్తులను జనవరి 11వ తేదీకి పూర్తి చేయాలని ఆయన ఆప్కాన్ సంస్థ అధికారులను ఆదేశించారు. రోడ్డును 11వ తేదీకి పూర్తిచేసి ఆరోజు రాత్రి నుండి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు.
అలాగే అలిపిరి నుండి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డును వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 11వ తేదీ రాత్రి నుండి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.
ఘాట్ రోడ్డులో జరుగుతున్న మరమ్మతు పనులను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. పనులను పర్యవేక్షిస్తున్న ఆప్కాన్ సంస్థ అధికారులు, పని చేస్తున్న కూలీలతోను చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడారు.
పనులు జరుగుతున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. 11వ తేదీ సాయంత్రానికి పనులు పూర్తి చేసి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రోడ్డు భక్చైతులకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.
11వ తేదీ రాత్రి నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఘాట్ రోడ్డు భక్తులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టు సంస్థ వారిని ఆదేశించారు. మరమ్మతు పనులు రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
.

Discussion about this post