శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత?
పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు?
ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి?
ఇవన్నీ తరచుగా మనకు ఎదురౌతూ ఉండే ప్రశ్నలు. కానీ.. వైకుంఠద్వార దర్శనానికి ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. ఆ విశిష్టత గురించి.. తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి అనేక వివరాలు అందిస్తున్నారు. అవి పాఠకులకోసం..
మానవులుకు 365 రోజులు…దేవతలకు ఒక్కరోజుతో సమానం
మానవులుకు 6 నెలల కాల సమయం.. దేవతలకు 12 గంటల సమయంగా పరిగణిస్తారు. దేవతలకు 12 గంటల రాత్రి సమయాన్ని దక్షిణాయణం అని.. పగలు 12 గంటల సమయాన్ని ఉత్తరాయణం అని అంటారు. దక్షిణాయణంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం దీనినే కర్కాటక మాసం అంటారు.
రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం.. 8 నుంచి 10 గంటల సమయాన్ని సింహ మాసం అంటారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం.. ఈ కాలం మానవులకు కన్యా మాసం. అర్దరాత్రి 12గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం.. మానవులుకు తులామాసం!
అలాగే మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు.. ఉదయం 2 నుంచి 4 గంటల సమయాన్ని మానవులుకు వృశ్చికమాసంగా పరిగణిస్తారు.
మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు.. ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని ధనుర్మాసంగా పిలుస్తారు.
దేవతలకు ఒక్క గంట సమయం.. మానవులకు 15.2 రోజులుతో సమానం. దేవతలకు 40 నిముషాల సమయం.. మానవులకు 10 రోజులుతో సమానం.
ఈ 10 రోజులు కాలమే.. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు!
దీనితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో.. ఏ రోజు దర్శనం చేసుకున్నా.. ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్దిస్తాయి అనేది విశ్వాసం.
.

Discussion about this post