సంక్రాంతి పండుగకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. అయితే కొన్ని విద్యాసంస్థలు మాత్రం సెలవు రోజుల్లో కూడా పాఠశాలలను నిర్వహిస్తూ, విద్యార్థులకు కనీసం పండుగ సంతోషాన్ని కూడా లేకుండా చేస్తున్నాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు)జిల్లా కార్యదర్శి ఎస్. జాకీర్ డిమాండ్ చేశారు.
పీడీఎస్ యూ ఆధ్వర్యంలో సోమవారం విద్యాసంస్థల బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా జాకీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులను కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు పెడచెవిన పెట్టి తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
అయినా శ్రీకాళహస్తి విద్యాశాఖ అధికారులు నిద్రావస్థలో ఉండడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాకాని పక్షంలో పీడీఎస్ యూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నాయకులు ప్రదీప్, హేమంత్ పాల్గొన్నారు.
.

Discussion about this post