• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 14, 2025
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

అడ్వకేట్లకు సమస్యగా మారిన సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ రెన్యువల్

admin by admin
November 29, 2024
0
అడ్వకేట్లకు సమస్యగా మారిన సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ రెన్యువల్

2019-2020 లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ సర్టిఫికెట్లు ఐదు సంవత్సరాల కాల పరిమితి ఇచ్చి జారీ చేసారు. అవి 2020 నుండి ఇచ్చినా సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చేసరికి 2022 వచ్చేసింది. 2020, 2021 సంవత్సరాలలో కరోనా వలన కోర్టులు జరగలేదు.

అయినప్పటికీ ఇప్పుడు 2025 జనవరి 1, కి సదరు సర్టిఫికెట్ల కాల వ్యవధి ముగిసినందున మరల ఐదేళ్లకి రెన్యువల్, కొత్తగా ఐదు సంవత్సరాల ప్రాక్టీస్ ముగిసిన వారు వెరిఫికేషన్ చేయించు కోవాలని బార్ కౌన్సిల్ వారు సర్కులర్ ఇచ్చారు. దాని ప్రకారం డిసెంబర్ 21 లోగా సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అప్లికేషన్లు పంపించు కోవాలి.

2019-2020 లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అప్లికేషన్లు పెట్టమని అన్నప్పుడు, డిగ్రీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని, ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నవారిని తొలగించాలని, ఉద్దేశ్యంతో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అప్లికేషన్లు మొదలుపెట్టినట్లు చెప్పారు. అలాగే కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు కనుగొన్నట్లు ప్రకటించారు. అయితే కొంత మంది సకాలంలో అప్లికేషను పెట్టుకోలేని వారు, కొన్ని కారణాల వలన డిగ్రీ సర్టిఫికెట్లు దగ్గర లేని వారు, అప్పటిలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ పొందలేక పోయారు.

వారిలో చాలా మంది సక్రమంగా బి.ఎల్ /ఎల్ఎల్ బి చదివి డిగ్రీ పొంది, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఉన్నారు. వీరంతా ఒక గౌరవ ప్రదంగా అడ్వకేట్ అనే స్టేటస్ ఉంచుకోవాలి అనుకున్న వారే. అలాగే కొంతమంది ఆడవాళ్ళు కుటుంబ బాధ్యతల వలన ఏక్టివ్ ప్రాక్టీస్ చేయలేకపోయినా, తమ అడ్వకేట్ హోదా ఉంచుకుని, తెలిసిన వారికి సలహాలు ఇస్తూ గౌరవం పొందాలి అనుకున్నవారు, సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ పొందలేక పోయారు.

ఇప్పుడు మళ్లీ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ రెన్యువల్ అప్లికేషన్లు పెట్టమని ఇచ్చిన సర్కులర్ ప్రకారం అడ్వకేటు ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చూపించడానికి 5 వకాల్తాలు/ 5 మెమో ఆఫ్ అప్పియరెన్స్ లు/ డ్రాఫ్టింగ్ డీడ్స్ సంబంధించిన ఆధారాలు పెట్టాల్సి ఉంది. లేదా ఈ కోర్టు వెబ్సైట్ లేదా కాజు లిస్టులో న్యాయవాది పేరు ఉంటే వాటిని జతపరచాలి లేదా తీర్పు/ ఆర్డరు కాపీలలో న్యాయవాది పేరు ఉంటే వాటిని జతపరచాలి.

ఈ ఆధారాలు ఎందుకంటే అడ్వకేటు ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చూపించడానికి, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్లను బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఓటర్లుగా తొలగించడానికి అని చెప్తున్నారు.

ఈ ఆధారాలు జత చేయకపోతే బార్ కౌన్సిల్ లిస్టు నుండి సదరు అడ్వకేటు పేరును తొలగిస్తారు. సదరు అడ్వకేటు ప్రాక్టీస్ చేయడానికి, ఓటింగులో పాల్గొనడానికి అర్హత కోల్పోతారు. ఈ నిబంధనలు అడ్వకేట్లకు సమస్యగా మారుతున్నాయి.

బార్ కౌన్సిల్ ఎన్నికలలో ప్రాక్టీస్ చేస్తున్న వారినే ఓటర్లుగా నమోదు చెయ్యాలని, ఆ విధంగా బార్ కౌన్సిల్ సభ్యులను ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్లకే అవకాశం కల్పించాలి అనుకోవడం కొంత సబబుగానే ఉంది అనుకోవచ్చు. కానీ ఎన్నికలకు బార్ కౌన్సిల్ లో అడ్వకేటు ఎన్రోల్మెంట్ కు ముడి పెట్టడం సరైనది అనిపించడం లేదు.

అడ్వకేటు చట్టం, బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం న్యాయ డిగ్రీ పొంది, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారందరూ అడ్వకేట్లగా ప్రాక్టీస్ చేయడానికి అర్హులు.
కానీ ఈ నిబంధనల వలన కనీసం ఐదు కేసులలో వకాల్తానామా / మెమో ఆఫ్ అప్పియరెన్స్ ఉన్న వారు మాత్రమే ప్రాక్టీస్ కొనసాగించడానికి అర్హులవుతారు.
దీని వలన కొంత మంది అడ్వకేట్లకు సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది.

కొంత మంది అడ్వకేట్లు ఛాంబర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వారి సలహాలు, డ్రాఫ్టింగ్ కక్షీదారులకు, సహ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
వారు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయకపోయినా అడ్వకేటుగా గౌరవం పొందుతూ ఉంటారు.

కొంత మంది అడ్వకేట్లు తమ సీనియర్ల దగ్గర పనిచేస్తూ ఉంటారు. సాధారణంగా సీనియరు మాత్రమే కోర్టులో వకాల్తా వేస్తారు. జూనియర్ అడ్వకేట్ వకాల్తానామా సీనియర్ తో పాటు సంతకం చెయ్యకపోయినా, కేసు విచారణ సీనియర్ తరుపున చేసే విధానం అమలులో ఉంది. కొన్ని కొన్ని కారణాల వలన జూనియర్ అడ్వకేట్లతో వకాల్తా సంతకం చేయించడం జరగదు.

అలాగే చాలా మంది ఆడవాళ్ళు న్యాయ డిగ్రీ పొంది, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా, పెళ్లి, పిల్లల బాధ్యతల వలన రోజూ కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేయలేని పరిస్థితి. కానీ వారు చదివిన చదువు తమకు గౌరవం ఇవ్వాలని తమని అడ్వకేటుగా గుర్తించడానికి ఇష్ట పడతారు.

ఇలా ఎంతో మంది కోర్టులలో వకాల్తా వేయకపోయినా అడ్వకేటుగా గుర్తింపు పొందడానికి గర్వపడుతు ఉంటారు. కోర్టులలో వకాల్తా వేసి కేసులు వాదించడమే కాదు, తాము న్యాయ డిగ్రీ పొందిన జ్ఞానంతో నలుగురికి అవసరమైన న్యాయ సలహాలు ఇవ్వడం కూడా అడ్వకేట్లకు గౌరవం. అందుకు అడ్వకేట్ గా రిజిస్ట్రేషన్, గుర్తింపు ఎంతో ఉపయోగపడుతుంది.

ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ నిబంధనల వలన వారందరూ అడ్వకేటు గుర్తింపుకు దూరం అవుతున్నారు.

డాక్టర్లు, ఇంజనీర్లు, ఆడిటర్లు, తమ అసోసియేషన్లలో సభ్యులకు ఇటువంటి నిబంధనలు పెట్టలేదు. డాక్టర్లు వైద్యం చేయకపోయినా, ఇంజనీర్లు ఏ ప్రాజెక్టులలో పనిచేయక పోయినా, ఆడిటర్లు ఆడిట్లు చేయకపోయినా, వారికి గౌరవంగా అసోసియేషన్లలో సభ్యులుగా ఉండనిస్తున్నారు. అటువంటప్పుడు అడ్వకేట్లకే ఈ ప్రాక్టీస్ నిబంధనలు ఎందుకు రూపొందించారో తెలియడం లేదు. ఇది ఎవరి ఆలోచన అయినా సక్రమంగా, అమోదయోగ్యంగా లేదు అనిపిస్తోంది.

అడ్వకేట్లు, వారి సంఘాలు, బార్ అసోసియేషన్లు దీని గురించి సరైన ఆలోచన చేయాలి. బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఓటర్లుగా పాల్గొనడానికి వేరే పద్ధతులలో ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టండి.

బార్ కౌన్సిల్ ఎన్నికల ఓటర్ల జాబితాలకు, బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా రిజిస్ట్రేషన్ కు ముడి పెట్టడం సరైనది కాదు.

అడ్వకేట్ అనేది ఒక గౌరవం.
ప్రాక్టీస్ చేసినా, చేయకపోయినా, అడ్వకేట్ గా ఎన్రోల్మెంట్ కావడం న్యాయ డిగ్రీ పొందిన వారి హక్కు, గౌరవం.
అడ్వకేట్ అనే గౌరవాన్ని కాపాడండి.

– పి. పి. శాస్త్రి,
అడ్వకేట్, ఏలూరు.

Tags: advocate pp sastrycertificate of practice renewalpp sastryపిపి శాస్త్రిప్రాక్టీస్ రెన్యువల్

Discussion about this post

Top Read Stories

No Content Available

VIDEO

https://youtu.be/qecT2wF60XU
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!