శృంగారాత్మకమైన పాత్రలు ఎంచుకున్నప్పటికీ.. తన వయసుకు తగ్గట్టుగానే ప్రౌఢ పాత్రలతోనే అనసూయ ఇన్నాళ్లూ అలరిస్తోంది. ఇప్పుడు ఏకంగా.. ఆంటీ వయసులో మాస్ మసాలా స్టెప్పులతో చిందేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఇందులో హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్నారు.
చావు కబురు చల్లగా ఆడియో నుంచి శృంగార పాత్రలకు ప్రత్యేకంగా అనిపించే అనసూయ చిందేసిన ఓ మాస్ ఐటెమ్ సాంగ్ ని విడుదల చేయడానికి ముహుర్తం ఖరారైంది. మార్చి 1న సాయంత్రం 4 గంటల 5 నిమషాలకి ‘పైన పటారం లోన లొటారం’ అంటూ సాగే మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ హీరో కార్తీకేయ, అనసూయ కలిసి చిందేసిన స్టెప్పులతో ఓ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోనే సినీ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉందంటున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ ఇప్పటికే చావు కబురు చల్లగా చిత్రం నుంచి విడుదల చేసిన పబ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పందన అందచేసిన మాస్ అభిమానులు అంచనాలకు తగ్గట్లుగానే రాబోతున్న పైన పటారం లోన లొటారం పాటను సిద్ధం చేసినట్లుగా తెలిపారు. చావు కబురు చల్లగా చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బస్తి బాలరాజు’ ఫస్ట్ లుక్, ఇంట్రో కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, కదిలే కాలాన్ని అడిగా అనే పాటలకు కూడా అనూహ్య స్పందన లభించిందని చిత్ర బృందం చెబుతోంది. ముఖ్యంగా కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరీ మాడ్యూలేషన్ చూస్తే మళ్లీ చూడాలనిపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయంటున్నారు.

.

Discussion about this post