రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేశారు. అది 24 గంటల్లో బలపడి వాయుగుండం గా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ వాయుగుండం.. మరింత బలపడి తుఫానుగా తమిళనాడు – పాండి చే రి తీరాన్ని డిసెంబర్ 2 వ తేదీన తీరం దాటే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేశారు. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర కు భారీ వర్ష సూచన ఉంటుందని అనుకుంటున్నారు.
నివర్ దెబ్బ మిగిలి ఉండగానే..
నివర్ తుపాను అనేక జిల్లాలకు భారీ నష్టాన్ని మిగిలించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడికక్కడ రోడ్లు కూడా కొట్టుకుపోవడం, వాహనాలు కొట్టుకుపోవడం కూడా జరిగింది. ఈ ప్రభావమే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈలోగా మరో తుపాను ముప్పు పొంచి ఉందనడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
.

Discussion about this post