తెలుగు నేలపై ప్రగతిశీల దృక్పథంలో ఏర్పడిన తొలి సాహితీ సంస్థ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 80 ఏళ్లుగా సామాజిక విలువల ఉన్నతీకరణకు కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు సాకం నాగరాజ అన్నారు.
బుధవారం ఉదయం చిత్తూరు పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అరసం సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ దేశంలో పెచ్చు పెరిగిపోతున్న మతతత్వ ధోరణులను ప్రతిఘటించడం రచయితలు, కళాకారులు, మేధావుల కర్తవ్యమన్నారు.
ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలకు నూతన శాఖలను ప్రారంభించి రెండు జిల్లాలకు ప్రత్యేక కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గాలు..
చిత్తూరు జిల్లా కార్యవర్గం..
గౌరవాధ్యక్షురాలు: ఆచార్య కిన్నెర శ్రీదేవి
అధ్యక్షులు: గంటా మోహన్
ప్రధాన కార్యదర్శి: పల్లిపట్టు నాగరాజ
ఉపాధ్యక్షులు: మూరిశెట్టి గోవిందు.
కార్యదర్శి: కొఠారి వెంకటరత్నం.
కార్యవర్గ సభ్యులు: శాంతకుమారి, పి.వి.బ్రహ్మానందం,
మల్లెల నాగరాజ,
డాక్టర్. దేవరాజులు
తిరుపతి జిల్లా కార్యవర్గం..
గౌరవాధ్యక్షురాలు: వి. ప్రతిమ
అధ్యక్షులు: యువశ్రీ మురళి.
ప్రధాన కార్యదర్శి: డాక్టర్. నెమిలేటి కిట్టన్న.
ఉపాధ్యక్షులు: పేరూరు బాలసుబ్రమణ్యం,
కార్యదర్శి: ఆర్. రాజేశ్వరమ్మ.
కార్యవర్గ సభ్యులు:
నీలకంఠం,
శశికళ,
పెళ్ళకూరు సునీల్,
ఒబ్బు దేవీప్రసాద్,
దాసరి చంద్రయ్య,
గండుపల్లి గోవిందయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Discussion about this post