అసలే అచ్చిరాని శాఖ అని పొలిటికల్ సర్కిళ్లలో చెప్పుకునే ఆరోగ్య శాఖను చేపట్టిన తర్వాత మంత్రి హరీశ్ రావు తనదైన పనితీరుతో దూసుకుపోతున్నారు. పూర్తి స్థాయి బాధ్యతలు చేతికి రావడంతో నెలలుగా పెండింగ్ లో ఉన్న పనులను చకచకా పూర్తి చేస్తున్నారు.
రోజుకు కనీసం ఒక ఆస్పత్రినైనా సందర్శిస్తూ, కీలక సమీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య శాఖను పరుగులు పెట్టిస్తున్నారు హరీశ్. అయితే, ఇవాళ ఆరోగ్య మంత్రికి ముప్పు తప్పినట్లయింది..
తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఆదివారం నాడు శంషాబాద్ ప్రాంతంలో ఓ కొత్త ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హరీశ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శంషాబాద్ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అనిత రెడ్డి తదితర ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. ప్రారంభోత్సవం తర్వాత మంత్రి హరీశ్, ఇతరులు అక్కడి నుంచి వెళ్లిపోయిన కాసేపటికే ఆస్పత్రిలో ప్రమాదం చోటుచేసుకుంది.
మంత్రి హరీశ్ రావు ప్రారంభించిన కొత్త ఆస్పత్రిలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. కొత్త ఆస్పత్రిలోని లిఫ్టులో పరిమితికి మించి జనం ఎక్కడం వల్లే వైర్లు తెగిపోయి కూలిపోయింది. గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు.
కాగా, తాను ప్రారంభించిన కొత్త ఆస్పత్రిలో లిఫ్టు కూలిపోయి పలువురు గాయపడటంపై మంత్రి హరీశ్ రావు విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. హరీశ్ అభిమానులు, ఆరోగ్య శాఖను బ్యాడ్ లక్ గా భావిస్తోన్న కొందరైతే మంత్రికి ముప్పు తప్పిందని చర్చించుకుంటున్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ ఆరోగ్య శాఖకు మంత్రిగా పనిచేసిన నేతలందరినీ బ్యాడ్ లక్ వెంటాడటం తెలిసిందే. 2014లో డిప్యూటీ సీఎం హోదాలో ఆ శాఖను నిర్వహించిన రాజయ్య.. కొంత కాలానికే అనూహ్య రీతిలో బర్తరఫ్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖను నిర్వహించిన లక్ష్మారెడ్డి.. 2018 ఎన్నికల్లో గెలిచినా మళ్లీ మంత్రి పదవి దక్కలేదు.
ఇక తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ఆరోగ్య శాఖను చూడటం, సీఎం కేసీఆర్ తో విభేదాలు పెరిగి బర్తరఫ్ కావడం చివరికి టీఆర్ఎస్ నుంచే బయటికి వెళ్లిపోవడంతో ఆ శాఖ పేరు చెబితేనే నేతలు బెంబేలెత్తే పరిస్థితి. అలాంటి శాఖను హరీశ్ రావుకు కేటాయించడం ద్వారా సీఎం కేసీఆర్ తన తర్వాతి టార్గెట్ ను ఎంచుకున్నారని కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
Discussion about this post