వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. డాక్టర్ వెంకటసుబ్బయ్య కడప జిల్లా బద్వేలు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వెంకటసుబ్బయ్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా సోమవారం తెల్లవారుజామున మరణించారు.
ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి.. వెంకటసుబ్బయ్య కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. సానుభూతి వ్యక్తం చేశారు.
డాక్టర్ వెంకటసుబ్బయ్య కడపలోని ఒక ప్రెవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6.15 గంటలకు మరణించారు.

.