ఒక పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటూ వైభవ స్థాయిని అనుభవించిన నాయకుడే.. ఆ తర్వాత పార్టీ ఫిరాయించి.. తన రాజకీయ మనుగడ కోసం వేరే పార్టీ తీర్థం పుచ్చుకునే పరిస్థితి ఎక్కడైనా ఏర్పడుతుందా? ఏమో రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు! బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం ఇక్కడ ఆశ్చర్యకరం కాదు!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు.. తెలుగుదేశం పార్టీ తరఫున మొదటిసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైభవ హోదాను అనుభవించిన బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. బీసీల సమస్యలపై గతంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో పార్టీల ప్రభుత్వాలపై పోరాడిన కృష్ణయ్య.. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీలో చేరదలచుకోవడం అనేది చర్చనీయాంశం అవుతోంది.
టీఆరెస్ లోకి ఆర్.కృష్ణయ్య వెళ్లనున్నారనే పుకారు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. దీనికి సంబంధించి ఆయన కేసీఆర్ తో మాటామంతీ పూర్తి చేశారని కూడా సమాచారం. ఆయనను ప్రాథమికంగా ఎమ్మెల్సీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. మండలి పదవితో పాటు మంత్రిగా కూడా అవకాశం దక్కవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెస్ తీర్థం పుచ్చుకోనున్నారని విశ్వసనీయ సమాచారం.
మంత్రి గంగుల కమలాకర్ తో పాటు, టీఆరెస్ సీనియర్ నేత వినోద్ కుమార్ తో కృష్ణయ్య పలుమార్లు సంప్రదింపులు జరిపారు. హుజురాబాద్ ఎన్నికల్లో కృష్ణయ్య బీజేపీ కి, ఈటల కు వ్యతిరేకంగా, టీఆరెస్ కు మద్దతు ఇస్తూ కృష్ణయ్య సంకేతాలిచ్చారు.
ఆర్.కృష్ణయ్య 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాభవం చెందింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు గానీ.. పార్టీ దారుణంగా దెబ్బతింది. అప్పట్లో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అధికార టీఆర్ఎస్ లో చేరిపోయినప్పటికీ.. కృష్ణయ్య దూరంగా ఉన్నారు. తెలుగుదేశానికి కూడా దూరమయ్యారు గానీ.. అధికార పార్టీకి దగ్గర కాలేదు. ఇన్నాళ్లకు ఆయన పార్టీ మారడం గురించి ప్రచారం జరుగుతోంది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
బీసీ నాయకుడు ఈటలకు వ్యతిరేకంగా బీసీ ఓటును కూడగట్టడానికి అధికార పార్టీ ఆర్.కృష్ణయ్య ను ఒక అస్త్రంగా మాత్రమే ప్రయోగిస్తున్నదా? లేదా, ఆయనకు పదవి కట్టబెట్టి సముచిత స్థానం కూడా ఇస్తుందా అనేది మాత్రం నిదానంగా తేలుతుంది.
Discussion about this post