• About Us
  • Contact Us
  • Our Team
Thursday, October 30, 2025
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Review : చాయ్ చమక్కులే… మిస్ ఇండియా!

admin by admin
November 6, 2020
0
keerti suresh miss india movie review

మహానటి లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ బయోపిక్‌లో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న కీర్తి సురేష్ మీద ఆకాశమంత ఎత్తులో హోప్స్ ఉన్నప్పుడు అమేజాన్‌లో పెంగ్విన్ సినిమా విడుదలైంది. సినిమా అంత బాగా లేకపోయినా ఎంతో కొంత టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న మిస్ ఇండియా విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో మన తెలుగు సినిమాలు ఉండేదే అంతంతమాత్రం. అలాంటి నెట్‌ఫ్లిక్స్‌లో ‘మిస్ ఇండియా’ రిలీజ్ అవుతోందంటే అంచనాలు ఇంకాస్త పెరిగాయి. మరి ఈ కీర్తి సురేష్ మిస్ ఇండియా ఆ అంచనాలను అందుకుందా? లేదా తుస్సుమనిపించిందా చూడాలి. 

కథ: ఓ చిన్న ఊర్లో ఉన్న మధ్యతరగతి కుటుంబంలో ఉన్న నరేష్( హీరోయిన్ తండ్రి), నదియా ( తల్లి) కు ఉన్న ముగ్గురు పిల్లల్లో చిన్నది మానస సంయుక్త (కీర్తి సురేష్). మానస తాత రాజేంద్ర ప్రసాద్. మెదటినుంచి తాతంటే.. తాత చేసే చాయ్ అంటే ఎంతో ప్రేమ ఉందని డెవలప్ చేసుకుంటూ మెదలవుతుంది. సినిమా మెదలయిన 15 నిమిషాలకే మానస ఎంబీఏ చదువుతూ ఉంటుంది.. మానస అన్న ఎంటెక్ ఫైనల్ ఇయర్ లో ఉంటాడు.. మానస అక్క లా చదివి ప్రాక్టిస్ మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉంటుంది. చదువు విషయం పక్కన పెడితే మానస తండ్రి కి అల్జైమర్స్ ఉంది అని తెలుస్తుంది. అది తెలిసిన తరువాత ఆ మధ్యతరగతి కుటుంబ ఆర్ధిక ఇబ్బందులను పెద్దమ్మాయి తన లాప్రాక్టీస్‌తో తీర్చగలుగుతుంది అనుకున్న వెంటనే ఆమె పెళ్లి దండలతో ఇంటికోచ్చి మెహం చూపి వెళ్లిపోతుంది. తర్వాత ఎంటెక్ లో మంచి స్కోర్ తో పాస్ అయిన అన్నకి అమెరికాలో ఉద్యోగం వస్తుంది. 

దేశం కోసం మిలిటరీలో సర్వీస్ చేసి రిటైర్ అయి అయుర్వేదం క్లినిక్ నడుపుతున్న దేశభక్తుడైన రాజేంద్ర ప్రసాద్ కు అమెరికా వెళ్లడం ఇష్టముండదు. సర్లే అని ఒప్పిస్తే తెల్లారేలేకల్లా ఔట్ అయిపోతాడు. అంతా మన మంచికే అని మిగిలిన ఫ్యామిలీ అమెరికా వెళ్తుంది. ఇదంతా కధ మొదలయిన 15 నిమిషాల్లోనే కళ్లు మూసి తెరిచే లోపలే అయిపోయినట్టు ఉంటుంది.

చిన్నప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చా అని మానస అనగానే లైఫ్ లో గోల్ లేకపోతే ర్యాంకులన్నీ వేస్టు అని నరేష్ తీసిపారేస్తాడు. అప్పట్నుంచి పెద్దయ్యాక ఎంబిఏ చేసి బిజినెస్ పెట్టాలనే గోల్ పెట్టుకుంటుంది. కానీ ఇంట్లోవాళ్లు, పనీ పాట లేని బంధువుల మిత్రులు వచి బిజినెస్ అనేది ఆడవాళ్లకి కాదు.. ఆడవాళ్లు బాగా చదివి మంచి డబ్బులు సంపాదిచే బకరా పట్టుకుని పెళ్లిచేసుకుని బిందాస్ ఉండాలి అని అందరూ అడక్కుండానే 8 ఏళ్ల పాపకి జ్ఞానబోధ చేసేస్తుటారు. పెద్దయి అమెరికాలో మిగిలిన ఎంబీఏ మంచి స్కోర్ తో పూర్తి చేసి పాస్ అవుతుంది. మధ్యలో ఇండియా వదిలొచ్చానన్న బాధలో ఉన్న మానసకు ఓ అబ్బాయి తగిలి ఆ బాధలు మర్చిపోవాలి అని బోధిస్తాడు. ఓకవైపు ఫ్రెండ్ షిప్, ఇంకోవైపు లవ్ ఉన్న వాళ్లిద్దరి మధ్య ఇంకో బాండ్ వస్తుంది. అదే బాస్ ఎంప్లాయి బాండ్. ఎంబీఏ పూర్తయ్యాక బిజినెస్ చేస్తానంటే కుదరదు అని.. ఉద్యోగమే చేయాలి లేదంటే ఇంట్లోంచి బయటకెళ్లిపో అని కుటుంబాన్ని పోషించే అన్న చెబుతాడు. ఇంకేంచేయలేని పరిస్థితుల్లో అన్న చెప్పిన జాబ్‌లో జాయిన్ అవుతుంది. విధివశాత్తూ అమె తనను డిప్రెషన్ నుండి బయటకు తెచ్చిన స్నేహితుడే ఆ కంపెనీ మేనేజర్ గా ఉంటాడు. అక్కడ కాస్త కధ నడిచిన తర్వాత ఆ మేనేజర్ మానస ఇంట్లోలేని సమయంలో తన ఇంటికొచ్చి మానసను పెళ్లి చేసుకునేందుకు తన పేరెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకొని హ్యాపీ అయిపోతాడు. ఇంటికొచ్చి జరిగింది తెలిసాక కోపంగా వెళ్లి వాడిని ‘మోహం చూపించొద్దు’ అనేసి ఉద్యోగాన్ని వదిలేస్తుంది. 

ఇలాంటి డెసిషన్లు తీసుకున్నా తర్వాత ఇంట్లోవాళ్లు బయటకు గెంటేస్తారు. ఫ్రెండ్స్ తో కలిపి టి కొట్టు పెట్టాలనుకుంటుంది. కానీ ఫ్రెండ్ కి అని అమెరికా లాంటి దేశంలో ఈ ఐడియా వర్కవుట్ కాదని తన రిక్వెస్ట్‌కి నో చెబుతారు. ఒంటరిగా స్ట్రగుల్ అవుతున్న మానస అమెరికాలోని అతి పెద్ద కాఫీ కంపెనీ ఓనర్ దగ్గరకు వెళ్లి తన చాయ్ కహానీ చెప్పాలనుకుంటుంది. కానీ జగపతిబాబు విలన్ కావడంతో ఆమె ప్లాన్ వర్కౌట్ కాదని చెప్పి బోనస్ గా 1000 డాలర్లు ఇస్తాడు. ఆ డబ్బు తో చిన్న సెరెమొనీ పెట్టి ఒక ఇన్వెస్టర్‌ను ఇంప్రెస్ చేస్తుంది. తరువాత వాడు బిజినెస్‌లకు ఇన్వెస్ట్‌మెంట్లు ఇస్తాడు అని తెలిసి అతనితో ఇన్వెస్ట్ చేయించి ఫస్ట్ షాప్ పెడుతుంది. షడన్ గా(‘సడన్’ కాడు) చాలా చోట్ల చాయ్ దుకాణం పెట్టేసి రెండు నెలల్లోనే  విలన్‌కి కాంపిటిషన్ అయిపోతుంది. మధ్యలో ఆమె పాయింట్లెస్ ఐడియా మీద పాయింట్లెస్ గా ఇన్వెస్ట్ చేసిన వాడికి అమెపై లవ్ పుడ్తుంది. వాడికి నో చెబుతుంది. మళ్లీ కాంపిటీషన్‌లో ఓడిపోతానేమో అనే భయంతో ఉన్న జగపతిబాబు వచ్చి ఆమెపై లవ్ గురించి చెబుతాడు. మళ్లీ నో చెబుతుంది. ఇంకా కథ ఇక్కడే ఉందేందిరా అనుకుని టైం చూస్తే ఇంకో 15 నిమిషాల సినిమా మిగిలుంటుంది. ఆ 15 నిమిషాల్లో నష్టాల్లో ఉన్న మానస పైకొచ్చి జగపతి బాబును రోడ్డు మీదకు ఎలా తెస్తుంది అనేది పూర్తి కథ.

ఇవి కూడా చదవండి :
కరోనా హెచ్చరిక : ముందుంది ముసళ్లపండుగ
నిమ్మగడ్డ చర్యలు జగన్‌కు నష్టమా? రాష్ట్రానికి ద్రోహమా?
విజయశాంతి కోసం ట్రై చేయడం వర్తీయేనా?
ఏటీఎంకు వెళ్లకుండా నోట్ల కట్టలు ఏమయ్యాయి?
మానవ కంప్యూటర్ బిరుదును అసహ్యించుకున్న మేథావి

క్యాస్టింగ్ : హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఆమె కనిపించగానే ప్రపోజ్ చేసే వాళ్లంతా దారినపోయే దానయ్యల్లా ఉంటారు. కీర్తి సురేష్ మహానటిలో అయినంత ఈ క్యారెక్టర్‌కి కనెక్ట్ కాలేదు. ఏదో అక్కడక్కడ కొద్దిగ పర్వాలేగా నటించిందని అనిపిస్తుంది. విలన్ గా దుమ్మురేపుతున్న జగపతిబాబు కూడా సోది లా కనిపించాడు. ఈ క్యారెక్టర్ నటన బాగుంది అని చెప్పేందుకు ఒక్కరు కూడా వర్తీ అనిపించేంటట్టు లేదు.

సెకండిన్నింగ్స్ మంచి పెర్ఫార్మెన్స్‌కు ఆస్కారం ఉన్న రోల్స్ చేస్తున్న నదియాతో అత్యంత కృతకంగా చేయించడం ఈ సినిమా దర్శకుడికి మాత్రమే సాధ్యమైంది. అలాగే రాజేంద్రప్రసాద్‌ను అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు వచ్చే గెటప్‌తో అతి ఉదాత్తతను పలికించే ప్రయత్నం చేశారు. నరేష్‌కు ఈ పాత్ర లెక్కలోనిదే కాదు. 

టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ : కెమెరా సుజిత్ వాసుదేవ్ వర్క్ ఓ మాదిరిగా చూస్తే ఇప్పుటి సినిమాల్తో పోల్చుకుంటే స్పెషల్ గా లేదు. స్పెషల్‌గా వర్ చేసినా ఉపయోగం లేని స్టోరీ. అలా అని చెప్పి కెమెరా వర్క్ బాలేదు అని చెప్పలేం. మ్యూజిక్ కూడా ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా ఉంది. ఓ రకంగా సోది మ్యూజిక్ అనే అనొచ్చు. కానీ ఇప్పుడు వచ్చే సినిమాల్లో పని చేసే వాళ్ల నుంచి ఇళయరాజా పాటలు ఎక్స్‌పెక్ట్ చేయలేం. కొందరు పెద్ద హీరోల చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న తమన్, ఇలాంటివి ఇంకో రెండు సినిమాలు చేస్తే.. రాగల అవకాశాల్ని కూడా పోగొట్టుకుంటాడని అనిపిస్తుంది. దానికి కూడా న్యూట్రల్ ఒపీనియన్. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బేసిక్ అనిపించింది. కథ గురించి వస్తే ఏం అనాలో తెలీదు. దర్శకుడు నరేంద్రనాధ్, తరుణ్ కుమార్ తో కలిసి సాగించిన రచన ఇది. డ్రాగ్ చేశారు అని చెప్పలేం. మొదటి పావు గంట ఆఖరి పావు గంటల్లో చిటుక్కుమని అయిపోయినట్టు ఉంది. ఫాస్ట్ గా వెళ్లింది అంటే సినిమా మోదలైన 20 నిమిషాలకే ఇంకెంతసేపు రా బాబు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా పెద్దగా ఏం లేదు. రొటీన్ రొట్ట స్టైల్‌లో ఉంది. మొదట ఫైనల్ పార్ట్ లో వచ్చే సీన్ నుంచి పాస్ట్ లోకి వెళ్లి మెల్లగా నెరేట్ చేసుకుంటూ పోవడం పాతబడిపోయిన టెక్నిక్. సినిమాలో అమ్మాయికి టీ అంటే ఇష్టం, ఆ ఇష్టం తాత వల్ల వచ్చింది అనుకోవచ్చు. చిన్నప్పుడు తాత పేరు అందరికీ తెలిసేలా చేస్తా అనడం తప్ప మళ్లీ తాత గురించి టాపిక్ ఏం రాదు. బహుశా ఆమె టీ దుకాణాలు అమెరికా అంతటా పెట్టడమే ఆమె చిన్నతనంలో చేసిన ప్రతిజ్ఞ ఏమో గానీ.. ఆ టీ షాపులకు తాతతో కనెక్ట్ చేయడం డైరక్టర్ మర్చిపోయాడు. కథ దాదాపుగా 90 శాం శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతుంది. నిర్మాత మహేష్ ఎస్.కోనేరు ఖర్చు పెట్టినట్టుగానే అనిపిస్తుంది గానీ.. అది కథకు రిఫ్లెక్ట్ కాలేదు. దర్శకుడు నరేంద్రనాధ్ ఒక కొటేషన్ మాస్టర్. ఆద్యంతమూ కొటేషన్లు కొట్టడానికి తెగ తపన పడిపోయాడు. ప్రతికేరక్టర్ వాట్సప్ కొటేషన్లనే డైలాగులుగా పలుకుతుంటుంది. వాట్సప్ లో పొద్దునలేస్తే వెల్లువలా వచ్చి పడే కొటేషన్లు, సూక్తులు, ఉపదేశాలను అక్కడ కట్ చేసి ఇక్కడ డైలాగుల రూపంలో పేస్ట్ చేశారేమో అనేంత చిరాకు పుడుతుంది. అలా జరక్కపోయిఉంటే గనుక.. ఈ డైలాగులన్నింటినీ కట్ చేసి వాట్సప్ లో మెసేజీలుగా పంపితే.. పనిలేని బ్యాచ్ ఫార్వార్డ్‌లు చేసుకుంటూ బతికేస్తుంది. అంతే తప్ప.. సినిమాలో సంభాషణలుగా ఇవి మహా ఎబ్బెట్టుగా ఉన్నాయి. 

మిస్ లీడింగ్ టైటిల్స్ తప్పు కాదు.. సినిమా మార్కెటింగ్ లో అదొక భాగం. కానీ మిస్ ఇండియా అనే టైటిల్ పెట్టి, కథను అమెరికాలో నడిపి.. ఒక టీకొట్టు- దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పేసి.. ప్రేక్షకులను రంజింపజేయాలని అనుకోవడం పెద్ద తప్పు. ఓటీటీ గనుక రిలీజైంది గానీ.. థియేటర్లలో పడి ఉంటే.. సినిమనాలో అసలు డొల్లతనం ఎంతో తెలిసిపోయేది. 

ఒపినియన్ : ఒక ఫేక్ ఫెమినిస్ట్ చాయ్ లవర్ అయితే.. ఆ చాయ్ లవర్ కథ రాస్తారు. ఆ కథే మిస్ ఇండియా సినిమా అవుతుంది. ఇందులో ఫేక్ ఫెమినిజం, చాయ్ ప్రేమ తప్ప ఇంకేంలేదు. కరెక్ట్ గా పోలిస్తే ఆ రెండూ పాయింట్స్ తో కథ రాయొచ్చు.. ఆ కథ హిట్ కూడా అవొచ్చు. కానీ, ఒక పది ఇరవై మంది వాళ్ల వాళ్ల స్వంత బుర్రతో ఏ మాత్రం ఒకరితో ఒకరు కనీసం మాట్లాడుకోకుండా రాసేసిన సీన్లను అతికిస్తే ఎంత గజిబిజిగా ఉంటుందో అంతకు మించిపోతుంది మిస్ ఇండియా కథ.

ఫీల్ : రన్నర్ అప్ కూడా కాదు.
స్కోర్ : 1.5/5

… ఆదర్శిని భారతీ కృష్ణ
 twitter.com@adarsinikissulu

Tags: cinema reviewdirector narendra nathkeerti suresh movie reviewkeerti suresh netflixmiss india reviewproducer mahesh koneruకీర్తి సురేష్ మిస్ ఇండియామిస్ ఇండియామిస్ ఇండియా రివ్యూసినిమా రివ్యూ

Discussion about this post

Top Read Stories

No Content Available

VIDEO

https://youtu.be/qecT2wF60XU
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!