తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త, బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ3 నిందితుడు భార్గవ రామ్.. బెంగుళూరులో అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి అఖిలప్రియ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఆమె బెయిల్ పిటిషన్ పై ఇవాళ సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు.
ఈ కేసులో ఏ3 నిందితుడు అఖిలప్రియ భర్త భార్గవరామ్. ఆయన ఇప్పటిదాకా పోలీసుల చేజిక్కలేదు. దాడికి పాల్పడి, కిడ్నాప్ చేసిన పదిమంది వ్యక్తులను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే దాడికి సూత్రధారిగా భావిస్తున్న వారిలో భార్గవరామ్ చిక్కలేదు.
ఆయన బెంగుళూరు పారిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడే అజ్ఞాతంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. కిడ్నాప్ తర్వాత భార్గవరామ్ బెంగుళూరు పారిపోయారా? అక్కడే ఉండి.. తమ మనుషుల ద్వారా.. కిడ్నాప్ వ్యవహారం నడిపించారా అనే దిశగా కూడాపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే.. కిడ్నాప్ తర్వాత.. బెంగుళూరు తీసుకువెళ్లడానికి కిడ్నాపర్లు ప్రయత్నించారని.. పోలీసులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేయడంతో జాగ్రత్తపడి.. కొన్నిగంటల పాటు అవుటర్ రింగ్ రోడ్డులోనే వాహనాలతో తిరుగుతూ ఉండి.. తర్వాత.. వారిని విడిచిపెట్టారని వార్తలు వచ్చాయి. పరారీలో ఉన్న భార్గవ రామ్ ను పట్టుకోడానికి టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీసు బృందాలు బెంగుళూరు వెళ్లాయి.
అది మాదే..
అసలు మొత్తం వివాదానికి కారణమైన హఫీజ్ పేట భూమి ప్రస్తుతానికి ఏవీసుబ్బారెడ్డి పేరు మీదే ఉంది. అయితే.. అది తమ తండ్రి కొన్న భూమి అని, దాని మీద హక్కులు తమకే చెందాలని అఖిలప్రియ వాదిస్తోంది. ఈ భూమి మొత్తం విలువ రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని కూడా తెలుస్తోంది.
.

Discussion about this post