తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి బొజ్జల బృందమ్మ కరోనా బారిన పడ్డారు. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి సుమారు మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఆయన ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా వారి కుటుంబం హైదరాబాదులో నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా ఇటీవల గోపాలక్రిష్ణారెడ్డికి కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల్లో ఆయనకు డెల్టా వేరియంట్ సోకినట్లు రెడు రోజుల కిందట నిర్ధారణ అయింది. బొజ్జలకు కొద్దిగా ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
బొజ్జలకు కరోనా సోకినట్లు నిర్దారణ కావడంతో… ఆయనకు అనుక్షణం సపర్యలు చేసే ఆయన సతీమణి బొజ్జల బృందమ్మ కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకుంది. ఆమెకు కూడా కరోనా సోకినట్లు గురువారం నిర్దారణ అయింది.
బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, ఆయన సతీమణి బృందమ్మ కొవిడ్ బారిన పడటంతో తెలుగుదేశం వర్గాలతో పాటు… శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వారి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ముఖ్యంగా బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి ఆరోగ్యం గురించి అందరూ భయపడుతున్నారు. ఈ దంపతులు త్వరగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
Discussion about this post