దీపావళిని మనం కేవలం రాముడు అయోధ్య నుంచి సీతమ్మను తిరిగి తీసుకువచ్చిన సందర్భంగా మాత్రమే జరుపుకోము. ఈ వేడుక జరుపుకోవడానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం, కృష్ణుడు-సత్యభామ నరకాసురుడిని చంపడం. మరొక కారణం, పాండవులు హస్తినాపురానికి తిరిగిరావడం. ఇంకొకటి లక్ష్మీ దేవి జన్మించడం. ఇంకొకటి రాజా విక్రమాదిత్య కి పట్టాభిషేకం. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి. చరిత్ర అంతా తెలుసుకున్నామంటే, మెల్లగా దీపావళి జరుపుకునేందుకు ప్రతి ఒక్క కారణం అర్థమవుతుంది.
ఇదంతా మనకి తెలుసు, సరే. మనం ఎప్పుడో చిన్నప్పుడు అవ్వనుంచో తాతనుంచో వినుంటాము. లేదా పెద్దయ్యాక వాటి మీద వచ్చిన సినిమాలు చూసి ఉంటాము. లేదా పెరుగుతూ ఉన్నప్పుడు పుస్తకాలో నవలల్లో చదివుంటాము. కానీ, విదేశీయులకు కూడా మన కథల గురించి తెలుసంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. చాలా విన్నాను, మనకి సంబంధించిన చరిత్రలు చాలా విదేశీయులకు తెలుసు అని… కానీ, వాళ్లు వాటి గురించి తమ ప్రజలకి చెప్పేటంత బాగా అర్థం చేసుకుని ఉంటారు అని ఎవరూ ఊహించలేరు.
నిజమే!
యూ.కే (యునైటెడ్ కింగ్డమ్) ప్రధాని అయిన బోరిస్ జాన్సన్ తన ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చాలానే చెప్పాడు. చీకటిపై వెలుగు విజయం సాధించడం దీపావళి జరుపుకోడానికి ముఖ్య కారణం అని తన ప్రజలకు తెలిపాడు. ఇప్పుడు, దీపావళి ఎందుకు జరుపుకుంటారు అనే కారణాలు అన్నీ చూసుకున్నామంటే, వాటిల్లో మెజారిటీ కారణాలు చెడుపై మంచి విజయం సాధించడం వల్లనే ఉంటాయి. ఇక్కడ కూడా జాన్సన్ అదే చెప్పాడు. రామాయణం నుంచి సూచనలు తీసుకుంటూ, శ్రీరాముడు ఎలాగైతే రావణుడిని ఓడించాడో, ఎప్పుడు చీకటిపై వెలుతురు ఎలా విజయం సాధిస్తుందో, అదే విధంగా చెడుపై మంచే గెలుస్తుందని జాన్సన్ తెలిపాడు. అజ్ఞానంపై జ్ఞానం గెలిచినట్లు, కరోనా పై ప్రజలు కూడా గెలుస్తారని తను చెప్పాడు. కానీ ఇక్కడ ఉన్న ఒకే ఒక్కటి ఏంటంటే, ఓపిక ఉండాలి. ఏ యుద్ధమూ త్వరగా అయిపోలేదు. మొదటి ప్రపంచ యుద్ధమే దాదాపు నాలుగేళ్లు గడిచింది. ఆ సైనికులకు ఓపిక నశించి పోయి ఉంటే, బాగుండేది కాదేమో. అదే విధంగా మనం కూడా ఓపిక పట్టాలి. కరోనాపై ప్రజలు తప్పకుండా గెలుస్తారనే నమ్మకం తనకి ఉందని బోరిస్ తెలిపాడు. దీపావళి కాంతులు ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తాయని తను ప్రజలను ప్రోత్సహించాడు.
కేవలం బోరిస్ జాన్సన్ మాత్రమే కాదు. ప్రపంచంలోని చాలా మంది నేతలు తమ ప్రజలకు దీపావళి సూచనలతో ప్రోత్సాహం ఇచ్చారు. ఈ నేతలలో వేల్స్ కి చెందిన ప్రిన్స్ చార్లెస్ ఒకడు. మామూలుగా దీపావళి ఎప్పుడూ అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటూ గడుపుతాము. కానీ ఇప్పుడు మాత్రం ఒక రకమైన భయం, ఆంక్షలతో జరుపుకోవాల్సి వస్తోందని తన నిరాశను వ్యక్తం చేశాడు. ఇది మనల్ని నిరాశకు గురి చేసినా, ఈ పండుగ సందేశాన్ని అందరికీ తెలిపి, దీని నుంచి స్ఫూర్తి పొంది బలంగా ఉండాలని తెలిపాడు. ఇలాంటి సమయంలో విదేశాలలో ఉన్న మన దేశానికి చెందిన వాళ్లు సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చారు. దీని గురించి ప్రిన్స్ చార్లెస్ యూకేలోని హిందూ, సిక్కు, జైన వర్గాలకు చెందిన వారిని ప్రశంసించాడు. ఈ స్ఫూర్తినిచ్చే అద్భుతమైన పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని తను కోరుకుంటున్నట్లు తెలిపాడు.
భారత దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో దీపావళిని నూతన సంవత్సరంగా తీసుకుంటారు. ఈ దీపావళి రోజున తక్కువ టపాసులను కాల్చి, సంతోషంగా మీ-మీ కుటుంబాలతో పండుగను ఆనందంగా జరుపుకుంటారని ఆశిద్దాం.
.
Discussion about this post