విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ ఆడియెన్స్ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూసి పరేషాన్ అవుతున్నారట మూవీ మేకర్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో జెట్ స్పీడుతో దూసుకుపోతున్న విజయ్ కు ఈ మూవీ బ్రేక్ వేసిందని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.అయితే నిజానికి ‘నోటా’ మూవీ స్టోరీని ముందుగా అల్లు అర్జున్ కు వినిపించాడట డైరెక్టర్ ఆనంద్ శంకర్. అలాగే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన జ్ఞానవేల్ రాజాకి అల్లు అరవింద్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ చనువుతోనే ‘నోటా’ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని జ్ఞానవేల్ రాజా, ఆనంద్ శంకర్ లు బన్నీకి కథ కూడా వినిపించారట.
అయితే కథ మొత్తం విన్నాక ఇలాంటి స్టోరీ తనకు సూట్ అవ్వదని నో చెప్పాడట. దీంతో ఇదే కథను విజయ్ దేవరకొండకి వినిపించారట. మొదట విజయ్ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అనగానే కొంచెం ఆలోచించాడట. పైగా ఈ ఇలాంటి మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నాడట. కానీ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని దర్శకనిర్మాతలు గట్టిగా చెప్పడంతో చివరకు ఈ రౌడీ హీరో కన్విన్స్ అయ్యాడట. సీన్ కట్ చేస్తే విజయ్ హీరోగా ‘నోటా’ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కి పలు వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ కంటెంట్ వీక్ గా ఉండటంతో రెండు చోట్లా ‘నోటా’కు ఓట్లు పడలేదు. దీంతో ఫ్లాప్ దిశగా పయనిస్తోంది ఈ సినిమా. అయితే అసలు ఈ మూవీ బన్నీ చేయాల్సింది అని టాక్ బయటకు రావడంతో.. అల్లువారి హీరో భలే తెలివిగా ఫ్లాప్ నుంచి ఎస్కేప్ అయ్యాడని సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. అసలే ‘నా పేరు సూర్య’ మూవీతో షాక్ తిన్న బన్నీ ఈ సినిమా కూడా చేసి ఉంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ మాత్రం దర్శకనిర్మాతల మాట విని ఫూల్ అయ్యాడని సెటైర్లు వేస్తున్నారు.
.
Discussion about this post