• About Us
  • Contact Us
  • Our Team
Friday, July 31, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

చెబితే శానా ఉంది-2 : ఎరక్కపోయి..!

admin by admin
November 11, 2021
0
చెబితే శానా ఉంది-2 : ఎరక్కపోయి..!

చాలాకాలంగా తెలిసిన ఒక పెద్దమనిషికి తన మహాద్భుత జీవిత విశేషాలను గ్రంథస్థం చేసుకోవాలని ముదిమి వయసులో ముచ్చటేసింది.

అమెరికాలో ఉంటున్న ఆయనగారి మనవడు కూడా తాతగారి లీలావిలాసాల గురించి తెలుసుకోవాలని కుతూహలపడ్డాడట.

ఆ పెద్దమనిషికి నేను పరిచయం గనుక ఒకరోజు ఫోనుచేసి మనసులో మాట చెప్పారు.

‘‘ఆత్మకథ రాసుకోవాలనుకుంటున్నాను. నా చేతివేళ్లు పని చేయట్లేదు. ఆరోగ్యమూ అంతంతమాత్రమే. మీకు తెలిసిన వారెవరైనా ఉన్నారా? నేను చెప్తా.. రాసి పెట్టాలి.’’

‘‘ఎవరో ఎందుకూ! నేను ఉన్నాను. ఆపని చేసిపెట్టగలను’’ అని నేను రెడీగా చేతిలోకి పెన్ను తీసుకున్నాను.

‘‘మీరే రాస్తానంటే తిరుగేలేదు. బ్రహ్మాండం. బ్లాంక్ చెక్ ఇస్తా. ఎమౌంట్ మీ ఇష్టం, రాసుకోండి’’ అంటూ బీరాలు పలికాడు.

ఇంకేముంది! భలేమంచి రాతబేరము అని సంబర పడుతూ రంగంలోకి దిగాను ఉత్సాహంగా.

ప్రతిరోజూ వారు తమ దివ్య చరితమును రెండు మూడు గంటలపాటు ఫోనులో చెప్పేవారు. ఇయర్ ఫోన్సు పెట్టుకుని పడీ పడీ రాసుకునేవాణ్ని. నెలరోజుల పాటు ఇలా తల ఎత్తకుండా ఏకదీక్షగా రాస్తూనే వెళ్లా. రెండు పెద్ద నోటుబుక్కులు నిండిపోయాయి.

‘జీవిత చరితం ఇప్పటికింతే’ అన్నారు ఒకరోజు విరామం ఇస్తూ…

హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుని రాతపనిలో పడ్డాను. మరో నెల రోజులు గడిచిపోయింది. స్క్రిప్టు సిద్ధం. కారు డ్రైవరును పంపి అయ్యగారు స్క్రిప్టును తెప్పించుకున్నారు.

మీగురించి మీరే గొప్పలు చెప్పుకోవడం బావుండదు. కనుక మీ గొప్పలను నేను డప్పు వాయిస్తా. ఆత్మకథను జీవిత కథగా రాస్తాను. అని చెప్పగా వారు మహదానందపడిపోయారు.

నాలుగు రోజులపాటు స్క్రిప్టును ముందునుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకు క్షుణ్నంగా చదివేసుకున్నాకే ఆనందంగా ఫోనుచేసి ‘అద్భుతః’ అంటూ అభినందనలతో ముంచెత్తారు.

నా ఆనందం అంబరాన్నంటింది. పనిలో పనిగా కంపోజింగ్, కవర్ డిజైన్ ప్రింటింగ్ వగైరా పనులు కూడా చేయించి ఆ పుణ్యఫలాన్నీ మీరే పొందండి అనగా, టన్నుల కొద్దీ పుణ్యం దక్కి నేరుగా స్వర్గలోకంలో కాలిడి ముసలి రంభతో డ్యూయెట్ పాడుకోవచ్చనుకున్నాను.

కంపోజింగ్ పనీ, కవర్ డిజైన్ పనీ పూర్తయింది. రెండు ప్రూఫ్ లు కళ్లు పోయేట్లు దిద్దాను. ఆ తర్వాత లక్ష్మీకటాక్షమనే శుభముహూర్తం రానే వచ్చింది.

‘ఎంతిమ్మంటారు మీ సేవలకు’ అని అడగ్గా –

ఇప్పటికే రెండు నెలలుగా మీ పనిమీదే ఉన్నా. మరో నెల రోజులకుగానీ పుస్తకం పని పూర్తి కాదు. వెరశి మూడు నెలలు కూలీగా ‘ఇంతివ్వండి’ అని విన్నవించుకున్నాను.

ఆ మాట చెవినపడ్డ మరుక్షణం అతగాడి ముఖంలో రంగులు మారాయి. ఆ బ్లాంక్ చెక్ పెద్దమనిషికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. కక్కాలేడు. మింగాలేడు.

ఆ క్షణం నుంచి ‘అద్భుతః’ అంటూ అభినందనలు కురిపించిన ఆ నోరే తప్పులను ఎంచసాగింది. నేనలా చెప్తే ఇలా రాశారేంటి? కవర్‌పైన ఫోటోలో ముక్కు సరిగా రాలేదేమిటి? ఈ బాక్స్ అయిటమ్‌ను మరింత అందంగా చేయలేమా?

ఇలా రేయింబవళ్లు ఫోన్లతో నన్ను చెండుకు తినేశాడు. అతగాడి నుంచి ఫోను వచ్చిందంటే చాలు బీపీ పెరిగిపోయేది. ప్రశాంతత కరువైంది. ఇక లాభం లేదనుకుని ఆ పెద్ద మనిషి ఇచ్చిన డబ్బును వెనక్కి పంపించేసి, నీకూ నాకూ ఇంతటితో రామ్ రామ్ అనేశాను.

ఆ జీవిత కథను ఆ తర్వాత నా పేరుతోనే అచ్చేసుకున్నాడు. ప్రెస్ ల చుట్టూ తిరగడంతో కరోనా బారిన పడ్డాడు. చేతి చమురూ చాలా వదిలింది ఆస్పత్రి వైద్యానికి.

నేనా ప్రాజెక్టు నుంచి తప్పుకుని మంచి పని చేశాననిపించింది. లేదంటే ఆ వైరస్ నాపైనా పగబట్టేదేమో!

రెండు నెలల కష్టం వృథా అయిందనిపించినా ‘అంతా మన మంచికే’ అనిపిస్తుంది.

జీవితంలో తారసపడ్డవారి ట్రూ కలర్స్ ఎప్పుడో ఒకప్పుడు బయటపడక మానవు. దాచేస్తే దాగని సత్యమిది.

– డాక్టర్ గోవిందరాజు చక్రధర్

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

Tags: chakradharchebithe sana undigovindaraju chakradharjournalist chakradharజీవితకథజీవితకథ ప్రహసనం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply