ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన లవ్ స్టొరీ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైంది. సున్నితమైన రో మ్ కం (రొమాంటిక్ కామెడీ) లు తీసే శేఖర్ ఈ సారి రొమాంటిక్ డ్రామా తీశాడు. అయితే ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఏమేరకు సక్సెస్ అయ్యాడో చూద్దాం.
ప్రేమ వివాహం చేసుకునేందుకు మిర్యాలగూడ లో ప్రణవ్ అనే దళిత యువకుడు హత్య కు లోనవడం అంశాన్ని బ్యాక్ డ్రాప్ లో పెట్టుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ కథ రాసుకున్నాడు అనిపించింది. అయితే సామాజిక అంశాలపై సందేశం ఇవ్వాలనే దర్శకుడు శేఖర్ ప్రయత్నం విజయవంతం కాలేదనే చెప్పాలి.
హీరోయిన్ సాయి పల్లవి మంచి డాన్సర్ అని అందరికీ తెలుసు. ఆమె లో ని అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ప్రథమార్థం లో వచ్చే పాటలో చూడొచ్చు. అయితే కథ లో స్పష్టత లేదు. అనేక అంశాలను కలగాపులగం చేశాసాడు దర్శకుడు. ఇంటర్వల్ తర్వాత సినిమా ఆసక్తికరం గా అనిపిస్తుంది. అంతలో హీరో ఇన్స్టిట్యూట్ లో పనిచేసే కుర్రవాడి హత్య, అతని ప్రియురాలు ఆత్మహత్య తో సినిమా గాడి తప్పుతుంది.
గతం లో వచ్చిన dear కామ్రేడ్ సినిమా తరహాలో ఈ సినిమా లో దర్శకుడు అనేక అంశాలను కలిపేశాడు. నాగ చైతన్య, సాయి పల్లవి ల మధ్య అద్భుతమైన సీన్స్ ఒకడి రెండు ఉన్నాయి. కానీ ఆ తర్వాత సినిమా బాగా సీరియస్ అయి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. హీరో హీరోయిన్లు దుబాయ్ పారి పోవాలనుకుని ఆలోచన చేసే సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి.
నటుడు ఉత్తేజ్ పాత్ర సినిమాకు మైనస్. పాటలు బావున్నా, ప్లేస్ మెంట్ రాంగ్.
టెక్నికల్ గా బావున్నా, రాసుకున్న కథ లో గందరగోళం అన్నిటినీ పాడుచేసింది.
నటీనటులు బాగా నటించారు. మతాంతర వివాహం అనే అంశం ఆసక్తి లేపినా దానిని లైంగిక వేధింపులతో కలిపి సినిమా మూడ్ ను పాడుచేసాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.
అయ్యా వారి బొమ్మ వెయ్య బోతే అది కాస్తా కోతి పిల్ల అయినట్లుగా వుంది ఈ ప్రేమ లేని ప్రేమ కథ సినిమా.
Discussion about this post