సోషల్ మీడియాలో అబద్దాలతో చెలరేగిపోయే వారికి మూజుటాడు బిగించే క్రమంలో ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫాక్ట్ చెక్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థకు శ్రీకారం దిద్దారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్, ట్విటర్ ఖాతాలను ఆయన ప్రారంభించారు. సోషల్ మీడియా ద్వారా జరిగే అబద్ధపు ప్రచారాలు తిప్పికొడుతూ, అసలు నిజాలేమిటో ప్రజలకు తెలియజెప్పడానికి ఈ వ్యవస్థ చురుగ్గా పని చేయాలని ఆయన భావిస్తున్నారు.
నిజానికి ఏపీ లో ఇప్పటికే అబద్ధపు ప్రచారాలకు పాల్పడే వారిని కట్టడి చేయడానికి కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ అస్త్రాలను అధికారులు ప్రయోగిస్తూనే ఉన్నారు. పోలీస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే అందువలన ఒక ప్రయోజనం మాత్రమే నెరవేరుతుంది. అలాంటి పనులకు పాల్పడే వారిని హెచ్చరించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నాయి. అయితే తరచూ ఇలాంటి కేసులు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. రాజకీయ కక్షసాధింపుగా కేసులు పెడుతున్నట్టుగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అరెస్టులు జరుగుతున్నాయే తప్ప.. అసలు నిజాలు ప్రజలకు తెలియడంలేదు. అందుకే ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ కు రూపకల్పన చేసినట్లుగా కనిపిస్తోంది.
అదేసమయంలో.. అబద్ధాలు ప్రచారం చేసే వారిని కట్టడి చేయాలని, అసలు అలాంటి ప్రచారాలు ఎక్కడినుంచి మొదలవుతున్నాయో గుర్తించి శిక్షించేలా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు. ఆలయాలపై దాడుల విషయంలో కూడా నిందితులు తేలుతున్నారని, తెలుగుదేశం వారికి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోందని.. జగన్ ప్రకటించడం విశేషం.
.

Discussion about this post