చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉద్యోగులకు కరోనా భయం పట్టుకుంది. వారం రోజుల వ్యవధిలోనే ఆరుగురు ఉద్యోగులు కొవిడ్ బారిన పడ్డారు.
ఇందులో నైవేద్యం తయారు చేసే పోటులో విధులు నిర్వర్తించే నలుగురు అర్చకులు ఉన్నారు. అదేవిధంగా ఆలయ పీఆర్వో కార్యాలయంలో పని చేపే ఓ ఉద్యోగి.. మహద్వారం వద్ద విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగి కొవిడ్ బారిన పడ్డారు.
వీరే కాకుండా తాజాగా మరో ఇద్దరు ఆలయ ఉద్యోగులకు కొవిడ్ సోకినట్లు తేలడంతో మిగిలిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ మూడవ దశ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. వైరస్ బారిన ఎక్కడ పడతామోననే భయం ఉద్యోగులను వెంటాడుతోంది.
రెండవ దశలో ఆలయంలో పనిచేసే ఓ ఒప్పంద ఉద్యోగితో పాటు.. ఓ ఉద్యోగి కుటుంబ సభ్యురాలు ఒకరు కొవిడ్ తో మృతి చెందారు. ఈ అనుభవాలను నెమరు వేసుకుని ఆలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా.. చాలామంది ఈ నిబంధనలు పాటించడడం లేదు. ఈ కారణంగా కూడా తాము కొవిడ్ బారిన పడే ప్రమాదముందని ఉద్యోగులు భయపడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
.

Discussion about this post