దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభం అయింది. 60 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్ల పైవారికి ఈ రోజు నుంచి కరోనా టీకాలు వేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ (PMJAY) కింద దేశవ్యాప్తంగా సుమారు 10,000 ప్రైవేట్ ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ (CGHS) కింద రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన 687 ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రులకు కోవిడ్-19 ఇమ్యూనిజైషన్ సెంటర్లుగా పేరు పెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా వేక్సినేషన్ జరుగుతోంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ వేయించుకునే ప్రజలకు ఉచితంగా అందనుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక డోసు కరోనా టీకా కు 250 రూపాయల ధర కేంద్రం నిర్ణయించింది. ఇందులో రూ.150 వేక్సిన్ ధర కాగా, రూ.100 వరకు గరిష్టంగా సర్వీస్ చార్జి కింద ప్రెవేటు ఆస్పత్రులు వసూలు చేసుకోవచ్చునని నిర్ణయించారు. ఆసుపత్రులు ఆ సర్వీస్ చార్జీలో రాయితీ కూడా ఇవ్వవచ్చు. అంటే.. ప్రెవేటు ఆస్పత్రుల్లో వేయించుకునే వారికి రూ.150 నుంచి రూ.250 లోగా ఒక డోసు వేక్సిన్ వేయడం జరగుతుంది.
నేషనల్ కో-విన్ యాప్ ద్వారా టీకా కోసం నమోదు చేసుకున్న వారికి వైద్య సిబ్బంది టీకాలు అందించనున్నారు. తొలిరోజు పరిమితంగానే వేక్సినేషన్ చేపట్టి, మంగళవారం నుంచి.. యాప్ లో నమోదు చేసుకోకపోయినా.. వేక్సిన్ వేయడాన్ని పరిశీలించాలని అనుకుంటున్నారు.
ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ప్రధాని మోడీ తీసుకున్నారు. అర్హులందరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. రాజకీయ, సినీ,పారిశ్రామిక వివిధ రంగాల ప్రముఖులు అనేక మంది రెండో విడతలో వ్యాక్సిన్ తీసుకోనున్నారు.
కోవిన్ పోర్టల్ 2.0 రెడీ
కో-విన్ 2.0 పోర్టల్ కూడా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. 60 ఏళ్ళు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్ల లోపు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు కూడా ఇవ్వాళ్టి నుంచి వాక్సినేషన్ పొందవచ్చు. వ్యాక్సిన్ పొందాలనుకునేవారు పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కో-విన్ 2.0 పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా కో-విన్ 2.0 పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ద్వారా గరిష్టంగా నలుగురు లబ్దిదారులు నమోదు చేసుకునేలా అవకాశం కల్పించారు. ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డ్, ఫొటో కలిగిన పెన్షన్ పత్రం ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు.
.

Discussion about this post