• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలిమాట: ప్రేమైక జీవనం

admin by admin
February 14, 2022
0
లోపలిమాట: ప్రేమైక జీవనం

ప్రేమ అనేది అద్వితీయమైనదని, అపురూపమైనదని, అజరామరమైనదని, సుగంధాలు వెదజల్లే పరిమళమని
యుగయుగాలుగా మానవుడు ఉపన్యాసాలు ఇస్తూ, ప్రేమ గీతాలు గానం చేస్తూ, భక్తి గీతాలు ఆలాపనలు గావిస్తూ అవిశ్రాంతంగా అన్వేషిస్తూ ఉన్నా మానవుడి జీవితంలో ‘ప్రేమ’ కు మాత్రం చోటు ఉండడం లేదు.

ఎందుకంటే …
ప్రేమకోసం అన్వేషణ, దానికోసం ఆరాటపడడం, ఆవేదన చెందడం అవివేకంతో కూడుకున్న పని. బజారుకు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకునే వస్తువు కాదది. ఎక్కడినుంచో దాన్ని
పట్టుకొచ్చి మనిషిలో ప్రత్యేకంగా ప్రతిష్టించాల్సిన అవసరం లేదు. అంతర్లీనంగా ప్రేమ మనిషిలోనే ఉంది.

నిజానికి మనిషి అంతరాంతరాల్లో ప్రేమ బంధింపబడి ఉంది. ఆప్యాయతానురాగాలు, బాధ్యత, కర్తవ్యం, కాలంచెల్లిన కట్టుబాట్లు,లోపభూయిష్టమైన విలువలు, అనుబంధాలు వంటి అబద్ధపు మాటల ముసుగులో ప్రేమ కప్పబడి మరుగున పడిపోయింది. వీటన్నింటినీ తొలగిస్తేగాని అది వికసించదు.

ఎలాగంటే…
ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కేటప్పుడు విగ్రహానికి చుట్టూ వ్యర్థంగా అంటి పెట్టుకుని ఉన్న రాతి తొడుగును నెమ్మదిగా కొట్టుకుంటూ తీసేస్తాడు. అప్పుడు శిల్పికి విగ్రహం సాక్షాత్కరిస్తుంది.

అలాగే…
ప్రేమ చుట్టూ కప్పబడి ఉన్న అబద్ధపు మాటలను పక్కకు తొలగిస్తేగాని అసలైన ప్రేమ మన ముందు సాక్షాత్కరింపబడదు.

నిజానికి…
పుష్పం ఎవరికోసమూ వికసించదు. నెమలి ఎవరికోసమూ నాట్యం చేయదు. కోయిల ఎవరికోసమూ కూయదు.
ఎందుకంటే అది వాటి సహజ స్థితి. అలాగే ప్రేమ అనేది కూడా ఒక అనుబంధం కాదు. అది ఒక స్థితి. దానికి దేనితోనూ, ఎవరితోనూ పనిలేదు. అది దేనిని ఆశించదు. కానీ, ప్రేమ విషయంలో మనం తప్పటడుగులు వేస్తూ ఉన్నాం. ఫలానా వాళ్ళు నన్ను ప్రేమించడంలేదని, ఎవరూ నన్ను పట్టించుకోవడంలేదని అనవసరంగా ఆందోళన చెందుతుండడంవల్ల ప్రేమకు దూరమయిపోతున్నాం.

గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే..

ప్రేమకు పునాది కామమే. గంగానదికి జన్మస్థానం గంగోత్రి ఎలాగో, ప్రేమగంగకు జన్మస్థలం సెక్సే, కామమే. మానవుడి జీవితానికి కామమే తొలి అడుగు. కామంలోనే మానవుడు జన్మించాడు. కామశక్తే మూలబిందువుగా ఈ సృష్టి నిర్మాణాన్ని భగవంతుడు చేశాడు. సృష్టికర్త దేన్ని ‘పాపం’ అని అనుకోలేదో ఆ కామాన్నే మనం పాపం అని అంటున్నాం. నిజానికి కామం అనేది పవిత్రమైనది.

ఆకలి దప్పికల వంటిదే సెక్స్. మనో, దేహ ఆరోగ్యాలకు సెక్స్ చాలా అవసరం. సెక్స్ జీవితంలో ఒక భాగం. దానికి నిత్య జీవితంలో ప్రముఖస్థానం వుంది. అది కల్తీలేని అనుభవం. ఆ కార్యం, అన్నిరకాల క్రియలకు, పనులకు భిన్నమైనది, అందమైనది. సంభోగ సమయంలో భయం ఉండదు. అది సంపూర్ణ ఐక్యం. ఆ క్షణంలో అన్ని ఆలోచనలు, ఘర్షణలు అణిగిపోతాయి. పరమానందమే ఉంటుంది.

కానీ, పవిత్రమైన కామానికి మనిషి తన వింత పోకడలను, వికృతచేష్టలను ఆపాదించడంవల్లే అది నేటి సమాజంలో లైంగిక వికారాలతో నిండిపోతోంది. అందువల్లే కామం అంటే అందరిలో అసహ్యం, అభద్రతా భావం ఏర్పడింది.

బొగ్గు నల్లగా ఉంటుందని, ముట్టుకుంటే మసి అవుతుందని భావిస్తాం. కానీ, బొగ్గు రూపాంతరం చెందితే ఓ వజ్రం అవుతుందనే విషయాన్ని మరచిపోతున్నాం. బొగ్గులోనూ, వజ్రంలోనూ మూలపదార్థం ఒక్కటే అనే విషయాన్ని విస్మరిస్తున్నాం. అలాగే కామోద్రేకాలన్నీ అదుపులోకి వచ్చిన తరువాత కామమే ‘ప్రేమ’ గా రూపాంతరం చెందుతుంది.

కాబట్టి…
రాయిలోని విగ్రహం చుట్టూ వ్యర్థంగా అంటి పెట్టుకుని ఉన్న రాతి తొడుగును శిల్పి తొలగించినట్లు కామానికి ఆపాదించబడిన వింతపోకడలను, వికృతచేష్టలను, మనో వికారాలను మన నుంచి తొలగించుకున్నట్లైతే అప్పుడు ప్రేమ అనేది మబ్బుల్లేని ఆకాశంవలె నిర్మలంగా, అప్పుడే వికసించిన పుష్పంవలే అందంగా, కల్మషంలేని మనసువలే స్వచ్ఛంగా మన ముందు సాక్షాత్కరింపబడుతుంది.

అప్పుడు మన హృదయం ప్రేమతో నిండిపోయుంటుంది. కాదు కాదు మనమే ప్రేమగా మారిపోతాం. ఆ స్థితిలో మనకు ఎవరితోనూ, దేనితోనూ అవసరం ఉండదు. మన నుంచే అందరికీ ప్రేమ పరిమళాల సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. అలా సుగంధ పరిమళాలు వెదజల్లే ప్రశాంత హృదయంతో జీవించడమే అసలైన ప్రేమైక జీవనం.

…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159

Tags: deviprasad obbulopali matao prasadobbu deviprasadobbu prasadఒబ్బు దేవీప్రసాద్దేవీప్రసాద్ ఒబ్బుప్రసాద్ లోపలిమాటలోపలి మాట
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply