‘ఎక్కడెక్కడో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనూరిలో ఎందుకు చేయకూడదు!’ ఆ పొద్దు నా బుర్రలో కొత్త ఆలోచన ఉదయించింది. అది కాస్తా ముదిరి, నడినెత్తిమీద వేడి రగిలించింది. చకచకా పావులు కదిపాను.
పాతిక కుట్టుమిషన్లు కొన్నాం. ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ట్రస్టు తరఫున ‘ఉచిత కుట్టుశిక్షణ కార్యక్రమం’ ప్రారంభించబోతున్నట్లు చాటింపు వేశాం. పోలోమని దాదాపు వందమంది పేర్లు నమోదు చేసుకున్నారు.
కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లకు కుట్టులో నైపుణ్యాలను బోధించటానికి ఓ ట్రైనర్‌ని నియమించాం.
మొదటిరోజు ఉదయం తొమ్మిది గంటలకే 30 మందీ వచ్చారు. ఒంటిగంట దాకా బుద్ధిగా నేర్చుకుని వెళ్లిపోయారు. రెండు గంటలకు వచ్చిన బ్యాచ్ మహిళలు కూడా అయిదు గంటల దాకా శ్రద్ధగా నేర్చుకున్నారు.
‘ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా భలే సదుపాయం చేశారు’.
‘చేతిలో ఆర్ట్ ఉంటే, ఏదో ఒక రూపంలో పనికొస్తుంది’.
‘ఇంట్లోవాళ్ల బట్టలు కుట్టుకున్నా బోలెడు డబ్బు ఆదా అవుతుంది’.
‘టీచర్ బాగా చెబుతోంది. మిషన్లు కూడా మంచివి ఏర్పాటు చేశారు’.
వారం పది రోజుల వరకూ కడుపు నింపే కామెంట్లు ఊరంతా షికారు చేశాయి. ఎవరెవరో ఫోన్లు చేసి చెబుతుంటే, నాలో నేను మురిసిపోయాను.
నెల సగానికి చిక్కిపోయాక, ఓరోజు టీచర్ ఫోన్ చేసింది.
‘‘సర్, ఏ ఒక్కరికీ శ్రద్ధ లేదు. సెంటర్‌కు వచ్చి టీవీ సీరియల్స్ గురించి, ఊళ్లో వ్యవహారాల గురించి తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకొంటున్నారు. ఇళ్ల నుంచి పాతబట్టలు తెచ్చి రిపేర్లు చెయ్యమని అడుగుతున్నారు. కాదంటే కసురుకుంటున్నారు. ఇద్దరో ముగ్గురో మాత్రమే మనసు పెట్టి నేర్చుకుంటున్నారు’’.
వారం తర్వాత నేను ఊరికి వెళ్లినప్పుడు అందరినీ సమావేశపర్చి, నీతిబోధ చేశాను. వాళ్లు తక్షణం రెండో చెవి గుండా వదిలేశారు.
ఆ తర్వాత ఒక్కొక్కరూ మానేస్తూ వచ్చారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న కొత్తవారికి అవకాశం కల్పించమని టీచరుకు చెప్పాను. కొత్తవాళ్లూ పాతవారి బాటలోనే నడిచారు.
అయిదు నెలలు గడిచినా నైపుణ్యం ఇనుమడించిన దాఖలా కనిపించలేదు.
తీవ్రంగా ఆలోచించిన మీదట మార్పునకు శ్రీకారం చుట్టాను.
* * * *
మా ఊరికి 15 కిలోమీటర్లు పక్కకు జరిగి, మరో గ్రామంలో దళితవాడలోని కమ్యూనిటీ హాలులో అదే తరహా శిక్షణ ప్రారంభించాం. మిషన్లన్నీ అక్కడికి తరలించాం.
ఊరంతా చాటింపు వేశాం.
‘‘కేవలం 500 రూపాయలకే మూడు నెలలపాటు కుట్టుశిక్షణ’’ అని ప్రకటించాం.
కేవలం 30 మంది మాత్రమే ఫీజు కట్టి చేరారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
శిక్షణ మొదలైంది. అందరూ బుద్ధిగా వచ్చేవారు. శ్రద్ధగా నేర్చుకునేవారు. ఒకటికి రెండుసార్లు అడిగి తెలుసుకునేవారు. టీచరుకు రోజుకొకరు చొప్పున మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేసేవారు. ఎప్పుడైనా పొద్దుపోతే తమ ఇళ్లలోనే ఆతిథ్యం ఇచ్చేవారు.
‘శిక్షణ చాలా బాగుంది’ అనే మాట ఊరంతా పాకింది. మరో బ్యాచ్ సిద్ధమైంది.
మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందిన అయిదుగురు మహిళలు కలిసి ఒక టైలరింగ్ సెంటరు పెట్టుకుంటామని ముందుకొచ్చారు. నేనే భరోసా ఇచ్చి బ్యాంకు లోను ఇప్పించాను.
రెండో బ్యాచ్ కూడా క్రమశిక్షణతో నడిచింది.
ఇప్పటికీ ఆ టైలరింగ్ సెంటర్ విజయవంతంగా నడుస్తోంది.
* * * *
మహారాష్ట్రలోని తలోజా జిల్లాలో చందరన్ అనే ఓ చిన్న గ్రామం.
ఆఫీసు పనిమీద అక్కడికి వెళ్లినప్పుడు నెలన్నర క్రితం ఆ గ్రామంలో మా ఫౌండేషన్ తరఫున ప్రారంభించిన ‘కమ్యూనిటీ ట్రైనింగ్ సెంటర్’ గురించి మా ఉద్యోగిని అడిగాను. వెంటనే అక్కడికి విజిట్ ఏర్పాటు చేశాడు.
దాదాపు పాతిక మంది మహిళలు సంప్రదాయరీతిలో ఘనంగా స్వాగతం పలికారు.
శిక్షణ కార్యక్రమం ఎలా ప్రారంభమైందో, ఇప్పటిదాకా ఎలా నడుస్తుందో టీచర్ వివరిస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగింది.
నేర్చుకోవటానికి వచ్చిన వారిలోంచి ముగ్గురు మహిళలు మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు.
మాకు ఎదురుగా ఎడమపక్క చివరి వరసలో కూచున్న నలుగురు అమ్మాయిలు నాకు భిన్నంగా కనిపించారు. నలుగురికీ ఇరవైలోపే ఉంటాయి. మొహాల్లో కళ ఉట్టిపడుతోంది. ఆహార్యం మాత్రం శుద్ద సంప్రదాయబద్ధంగా, వైవిధ్యంగా ఉంది.
ఒక అమ్మాయిని మాట్లాడమని అడిగాను. మా ఉద్యోగి సూచన మేరకు ఒకరి తర్వాత ఒకరు నలుగురూ మాట్లాడారు.
మరాఠీ నాకు అర్థం కాలేదు. మా ఉద్యోగి చెప్పిన వివరాలిలా ఉన్నాయి…
‘‘ఆ నలుగురూ అక్కడికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే గిరిజన తండా నుంచి వస్తారు. నలుగురికీ పెళ్లిళ్లయ్యాయి. పేదరికం కారణంగా బస్సుఛార్జీలకు డబ్బుల్లేక ప్రతిరోజూ నడిచి వస్తున్నారు. చక్కగా నేర్చుకుంటున్నారు. శిక్షణ పూర్తయితే ఎలాగోలా మిషన్లు కొనుక్కొని తమ తండాలోనే ఉండి నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చని ఆశ పడుతున్నారు. ఇక్కడి శిక్షణ పట్ల, టీచర్ పట్ల విపరీతమైన గౌరవంతో ఉన్నారు’’.
వారు ప్రతిరోజూ ఆటోలో వచ్చేలా చర్యలు తీసుకోమని, ఆ ఖర్చు మనమే భరించాలని మా ఉద్యోగికి చెప్పాను. శిక్షణ పూర్తయ్యాక చేయాల్సిన సాయం గురించి కూడా చెప్పాను.
* * * *
మా అమ్మమ్మ ఎప్పుడూ చెబుతుండేది…
‘‘కడుపు కాలినోడికి పచ్చడి మెతుకులే పరమాన్నం.
బొజ్జ నిండినోడికి ఏది పెట్టినా అజీర్ణం’’ అని.
.. ఎమ్వీ రామిరెడ్డి
986777870
Discussion about this post