ఆంధ్రప్రదేశ్ – బీహార్ రాష్ట్రాల మద్య జరిగిన మహిళా , పురుషుల విభాగాల్లో రాష్ట్ర జట్ల క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ 54 – 21 పాయింట్ల తేడాతో బీహార్ పై నెగ్గింది. మరో మ్యాచ్ లో హిమాచల్ ప్రదేశ్ 75 – 25 పాయింట్ల తేడాతో వై ఎం సి ఎ ఫరీదాబాద్ జట్టు పై విజయం సాదించింది.
మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు 44 – 23పాయింట్ల తేడాతో బీహార్ పై గెలిచింది. మరో మ్యాచ్ లో రాజస్తాన్ 39 – 18 పాయింట్ల తేడాతో కేరళ పై ఆదిక్యత సాదించింది.
ఉత్తమ క్రీడాకారులుగా
మ్యాచ్ లలో ఉత్తమ క్రీడాకారులుగా ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ జట్టులోని చిత్తూరు జిల్లా క్రీడాకారుడు సుమన్ ఆసాధారణ ప్రతిభ కనబరిచారు. ఆయనతో పాటు రాష్ట్ర మహిళా జట్టులో శ్రీకాకుళం కు చెందిన సంధ్య , రాజస్తాన్ మహిళా జట్టులో సీమా చౌదరి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. హిమాచల్ ప్రదేశ్ పురుషుల జట్టు లో ఉత్తమ క్రీడాకారుడుగా రాహుల్ ఎంపికయ్యారు. వీరికి తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి రూ.5000/- నగదు బహుమతిగా అందించారు.
.

Discussion about this post