మనకు భూమిమీద నూకలుంటే ఎలాగైనాబతికేస్తాం… అలాకాకుండా నూకలు అయిపోయాయంటే… ఏమీ లేకున్నా పైకెళ్లిపోతాం. ఇదంతా దేవుడి లీల… ఇలాంటి మాటలు మనం చాలా వింటుంటాం. అలాంటిదే ఒక సంఘటన టర్కీలో జరిగింది. అక్కడి వారిని దేవుడి లీలలు గ్రహించేలా చేసింది.
టర్కీలోని ఇజ్మీర్ లో జరిగిన భూకంపం ధాటికి పలు భవనాలునేలమట్టమయినాయి. చాలామంది చనిపోగా,ఎంతోమందిశిధిలాల మధ్యచిక్కుకుని సహాయక కార్యక్రమాల్లో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ నేపధ్యంలో సుమారు నాలుగు రోజులపాటు ప్రాణాలు అరచేత పెట్టుకుని సహాయకుల కోసం ఎదురుచూసి చివరికి బతికి బయటపడడం అంటే సామాన్య విషయం కాదు. అందునా ఒక చిన్నారి ఇలాంటి పరిస్థితుల్లో బతికి బయటపడింది అంటే అది ఖచ్చితంగా దేవుడి మాయే అనిచెప్పవచ్చు.
నాలుగురోజుల పాటు నడుము వరకు శిధిలాలు కమ్యేయగా కదలడానికి కూడా శక్తిలేక… ఆకలికి తట్టుకుని… బ్రతకడానికి పోరాడిన ఆ చిన్నారి చివరికి విజయం సాధించింది. శిథిలాలను తొలగించడానికి వచ్చిన సహాయక సిబ్బందిని గమనించిన చిన్నారి చేయిఊపి పిలవడంతో ఆశ్చర్యపోయిన వారు అక్కడికి వెళ్లి శిథిలాల మధ్య చిక్కుకుని ఉన్న మూడేళ్లచిన్నారిని రక్షించారు. అలా ప్రాణాలు నిలుపుకున్న ఆ చిన్నారి పేరు గెజ్గిన్. ఆ పాపను చూసిన సహాయక సిబ్బంది ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అంటూ కేకలు పెట్టి ఆమెను రక్షించారు. ఆ పాపకు కావలసిన ఆహారాన్ని అందించి ఆ పాపను కాపాడినట్టు, ఇది తమకు ఎంతో సంతోషాన్నికలిగించిందని వారు చెబుతున్నారు. అయినా బతకాలిఅని దేవుడు మన ముఖాన రాసి వుంటే… ఎలాగైనా బతికేస్తాం. ఇలా కూడా అన్నమాట…
.

Discussion about this post