• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, July 22, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : ప్రేమ ఎంత గొప్పది? ఎందుకు?

admin by admin
September 26, 2021
0
Good Morning : ప్రేమ ఎంత గొప్పది? ఎందుకు?

పూర్ణమదం.. పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ..
పూర్ణమేవా వశిష్యతే

.. అనే మాటను ఉపనిషత్తు చెబుతుంది.

భగవంతుడు నిత్యమైన వాడు, కొరతలేని వాడు అనే సంగతి చెప్పడానికి ఉపనిషత్తు ఈ వాక్యాలను ఉటంకిస్తుంది. దీని భావం ఏంటంటే..

అక్కడ పూర్ణం (నిండుగా) ఉంది. ఇక్కడ కూడా పూర్ణం ఉంది. పూర్ణంలోంచే పూర్ణం ఉద్భవించింది. పూర్ణంలోంచి పూర్ణాన్ని తీసివేసినా కూడా శేషంగా మిగిలేదీ పూర్ణమే అవుతుంది.. అని భావం!

నిండుగా ఉండే భగవంతుడిలోంచి.. నిండుదనం ఉన్న ఈ బ్రహ్మాండం ఉద్భవించిందని, అయినా భగవానుడు ఎప్పటికీ నిండుగానే ఉంటాడని, మరో నిండుతనాన్ని వేరుచేసినా కూడా… శేషం కూడా పరిపూర్ణమైన భగవానుడిగానే ఉంటాడని ఈ ఉపనిషద్వాక్యం భావం.

ఇదంతా నిజమే కావచ్చు. కానీ, భగవానుడు అనే మాటను ‘ప్రేమ’ అనే పదంతో రీప్లేస్ చేసి చూడండి.

ఒకరిలో సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది.  రెండోవారిలోనూ సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది. సంపూర్ణమైన ప్రేమలోంచి జనించే ప్రేమ కూడా సంపూర్ణంగానే ఉంటుంది. సంపూర్ణమైన ప్రేమలోంచి సంపూర్ణమైన ప్రేమను పక్కకు తీస్తే.. మిగిలే అవశేషం కూడా సంపూర్ణంగానే ఉంటుది.

సిద్ధాంతంలాగా చూసినప్పుడు.. ఇదంతా ఒక మాటల అల్లిక లాగా గజిబిజిగా అనిపించవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుందాం.

ఒక వ్యక్తి తన తల్లి పట్ల నూరుశాతం ప్రేమతో ఉంటాడు. తల్లిలో కూడా కొడుకు పట్ల నూరుశాతం ప్రేమ ఉంటుంది. అతనికి పెళ్లవుతుంది. భార్యను కూడా ప్రేమిస్తాడు. భార్య పట్ల నూరు శాతం ప్రేమనే కలిగి ఉంటాడనుకుందాం. అంతమాత్రాన తల్లి పట్ల ఉండే ప్రేమ అంతరించిపోయిందని అర్థం కాదు. తర్వాత.. అతనికి ఓ కూతురు కూడా పుడితే.. కూతురును కూడా నూరుశాతం ప్రేమిస్తాడనే అనుకుందాం. అంతమాత్రాన తల్లి పట్ల, భార్య పట్ల ప్రేమ పలచబడిందని కాదు.

ప్రేమ స్వరూపమే అంత! ప్రేమ నిత్యమైనది. ప్రేమ అక్షయమైనది. ఒకరిని మనం పరిపూర్ణంగా ప్రేమిస్తున్నంత మాత్రాన.. అదే స్థాయి పూర్ణమైన ప్రేమను ఇంకా ఎంతమందికైనా పంచిపెట్టడం సాధ్యమవుతుంది. మనస్ఫూర్తిగా ఆ పని చేయగలిగితే ఏ ఒక్క ప్రేమలో కూడా ఎలాంటి లోటు ఉండదు. అందుకే మనం తోటి మనుషుల పట్ల ప్రేమగా ఉండడాన్ని అలవాటు చేసుకోవాలి. కల్మషం లేని ప్రేమను.. ఎంత మందికి పంచినా కొరత ఉండదనీ అర్థం చేసుకోవాలి. ప్రేమ అనేది ఉపనిషత్తులు ప్రవచించే భగవంతుని స్వరూపానికి, మన నిత్య వ్యవహారంలో కళ్లెదుట కనిపించే సత్యమైన రూపం అని మనం అర్థం చేసుకోవాలి.

భగవంతుడు ఉన్నాడా లేదా అనే మీమాంస మామూలు మనుషులు తేల్చగలిగేది కాదు. కానీ ప్రేమ అనేది మన కళ్లెదురుగా కనిపించేది. మనం స్వయంగా అనుభూతిస్తున్నది. మనలో చైతన్యాలకు కారణభూతం అవుతున్నటువంటిది. అలాంటప్పుడు.. ‘పూర్ణస్య పూర్ణమాదాయ.. పూర్ణమేవా వశిష్యతే’ అనే వేదోక్తిని.. ప్రేమస్వరూపంగా పరిగణించి, అలవాటు చేసుకుంటే.. మన జీవితాలు ఆనందమయం అవుతాయి.

Tags: goodmoninggoodmorning messagepurna madampurnameva vasishyathepurnasya purnamadayasubhashitamsubhashithamపూర్ణమేవా వశిష్యతే
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply