అమేజాన్ ఇండియా కోసం స్మార్ట్ ఫోన్స్ మరియు టెలివిజన్స్ కోసం ప్రముఖ మూడు మార్కెట్స్ లో ఒకటిగా తెలంగాణా అభివృద్ధిచెందింది
● అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ అరీనా హైదరాబాద్ లో ప్రవేశించింది మరియు పండగ సంబరం కోసం వేదికను ఏర్పాటు చేసింది
● టీవీ సేల్స్ కోసం హైదరాబాద్ ప్రముఖ పట్టణాలలో ఒకటిగా ఉంది మరియు పండగ సీజన్ సమయంలో అమేజాన్ కోసం స్మార్ట్ ఫోన్ లో రెట్టింపు డిజిట్ వృద్ధిని చూసింది
● తెలంగాణాలో శామ్ సంగ్, వన్ ప్లస్, రియమల్మీ, నర్జో, గ్జియోమి మరియు ఐక్యూలు అత్యంత ప్రసిద్ధి చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కాగా సోనీ, శామ్ సంగ్ మరియు ఎల్జీలు ప్రాధాన్యత ఇవ్వబడిన టీవీ బ్రాండ్స్ గా ఉన్నాయి
● స్మార్ట్ ఫోన్ కొనుగోలు నిర్ణయాలను సరళీకృతం చేయడానికి డిజిట్ సహకారంతో Amazon.in కూడా “ స్మార్ట్ ఫోన్ జీనీ“ని పరిచయం చేసింది
హైదరాబాద్, అక్టోబర్, 2023: టెలివిజన్స్ లో తెలంగాణా గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని Amazon.in ప్రకటించింది మరియు పండగల సమయంలో 60%కి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించబడి అమేజాన్ ఇండియా కోసం టీవీ మరియు స్మార్ట్ ఫోన్ శ్రేణులలో ఈ ప్రాంతం ప్రముఖంగా నిలిచింది. నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆర్థిక పథకాలు ద్వారా ప్రోత్సహించబడి, ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ మరియు పెద్ద –స్క్రీన్ టెలివిజన్స్ ను ఎంచుకునే కస్టమర్స్ ల సంఖ్యలో రాష్ట్రం ప్రముఖ ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది.
అక్టోబర్ 26న ‘అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ ఎరీనా’ (ఏఎక్స్ఏ) తో హైదరాబాద్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023ను కూడా హైదరాబాద్ లోని కస్టమర్స్ కు అవకాశం కలిగింది. ఈ విలక్షణమైన షోకేస్ తమకు ఇష్టమైన బ్రాండ్స్ మరియ ఉత్పత్తులను అనుభవించడానికి మరియు వినోదాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాన్ని మీడియా, ఇన్ ఫ్లూయెన్సర్స్ మరియ కస్టమర్స్ కు కలిగించింది. కార్యక్రమంలో ఏడు ఇంటరాక్టివ్ జోన్స్ లో, ఉత్తేజభరితమైన బహుమతులు గెలవడానికి కస్టమర్స్ పోటీపడ్డారు మరియు తమ ప్రముఖ బ్రాండ్స్ కు చెందిన శ్రేణిలను పరిశీలించే అవకాశం కూడా కలిగింది.
ఈ సందర్భంగా, అమెజాన్ ఇండియా స్మార్ట్ ఫోన్స్ అండ్ టెలివిజన్స్ డైరెక్టర్ రంజిత్ బాబు ఇలా అన్నారు, “హైదరాబాద్‌లో మా కస్టమర్‌లకు అమెజాన్ ఎక్స్ పీరియెన్స్ ఎరీనాను పరిచయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. నవాబ్స్ నగరం స్మార్ట్ ఫోన్ మరియు టెలివిజన్ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మెట్రోలలో ఒకటిగా నిలిచింది. తెలంగాణ ప్రజలు పండుగల సీజన్‌లో భారతదేశంలో అత్యంత ఇష్టపడే, విశ్వసనీయమైన మరియు అభిమానించే ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లో తమ అభిమాన ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడం కొనసాగిస్తుడటం వలన, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధిని చూసి మేము గర్విస్తున్నాము. ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లు మరియు టెలివిజన్‌ల పై కస్టమర్ ప్రాధాన్యత పెరుగుతుండటం వలన, మేము అమెజాన్ ఇండియాలో నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్‌లు, Apay రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు ఉత్తమమైన ఉత్పత్తుల శ్రేణి వంటి ఆకర్షణీయమైన సరసమైన ఎంపికలను అన్ని ప్రధాన బ్రాండ్ల నుండి అందిస్తూనే ఉన్నాము.”
తెలంగాణా మరియు హైదరాబాద్ లో Amazon.inలో గమనించిన స్మార్ట్ ఫోన్స్ మరియు టెలివిజన్స్ వ్యాపారంలో ఇక్కడ కొన్ని పోకడలు ఇవ్వబడినవి :
స్మార్ట్ ఫోన్స్
● 5జీ అప్ గ్రేడ్స్ ఎగువ స్థాయిలో ఉన్నాయి: హైదరాబాద్ లో, 5జీ స్మార్ట్ ఫోన్స్ వాటా పండగల సమయంలో అక్టోబర్ 2023లో 65%కి పైగా చేరుకుంది (వెర్సెస్ 2022లో 40%+)
● గణనీయమైన వృద్ధిని అనుభవిస్తున్న స్మార్ట్ ఫోన్స్ వ్యాపారం: 4 జీ నుండి 5జీ అప్ గ్రేడ్స్ తో ప్రోత్సహించబడిన 10-20 వేల స్మార్ట్ ఫోన్స్ లో హైదరాబాద్ లో రెండు అంకెల వృద్ధి కనిపించింది
● ప్రీమియం ఒక పోకడగా కొనసాగింది: నో కాస్ట్ EMI మరియు ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ వంటి సరసమైన ఆప్షన్స్ వలన 30 వేలకు పైగా శ్రేణులలో రెండు అంకెల వృద్ధి కనిపించింది.
● బ్రాండ్ ప్రాధాన్యత : కొనసాగుతున్న అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2023 సమయంలో, హైదరాబాద్ లో ప్రముఖ బెస్ట్ సెల్లర్ మోడల్స్ లో ఐఫోన్ 13, వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ, iQOO Z7 ప్రో 5జీ, వన్ ప్లస్ 11ఆర్ 5జీ, శామ్ సంగ్ గాలక్సీ ఎం14 5జీ మరియ రెడ్మీ 12 5జీలు ఉన్నాయి.
టెలివిజన్స్
● కొత్త రికార్డ్ ను నెలకొల్పిన తెలంగాణా : 2003లో, తెలంగాణా క్యూ3 2023లో అమేజాన్ ఇండియాలో వేగవంతంగా పెరిగే మార్కెట్ గా అభివృద్ధి చెందింది మరియు భారతదేశం అంతటా టీవీ సేల్స్ కోసం ప్రముఖ 3 నగరాలలో ఒకటిగా హైదరాబాద్ తో స్థిరంగా #1 ర్యాంక్ సాధించింది
● పెద్ద స్క్రీన్స్ కోసం పెరిగిన డిమాండ్ : కస్టమర్స్ 4k టీవీల కోసం ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద స్క్రీన్స్ కోసం ముఖ్యంగా 55 అంగుళాలు & ఎక్కువలో భారీ వృద్ధి కోసం డిమాండ్ ఏర్పడింది. క్యూఎల్ ఈడీ మరియు ఓఎల్ఈడీ టీవీలు 2023లో తెలంగాణా మరియు హైదరాబాద్ రెండిటిలో 2x సాటిలేని yoy చూపించాయి. అమేజాన్ లో కేటాయించిన జీరో వడ్డీ ఈఎంఐ ఆప్షన్స్ నుండి ముగ్గురు కస్టమర్స్ లో ఒకరు ప్రయోజనం పొందారు.
● బ్రాండ్ ప్రాధాన్యత : సోనీ, శామ్ సంగ్, మరియు ఎల్జీలు ఈ ప్రాంతంలో కస్టమర్స్ అత్యంత ప్రాధాన్యతనిచ్చిన బ్రాండ్స్ గా నిలిచాయి
తెలంగాణ ఒక కీలకమైన మార్కెట్ మరియు భారతదేశంలో అమెజాన్ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అమెజాన్ యొక్క అతి పెద్ద కార్పొరేట్ భవనం భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్ క్యాంపస్ U.S. బయట అమెజాన్ వారిస యాజమాన్యంలో ఉన్న మొదటి కార్యాలయ భవనం. అమెజాన్ భారతదేశం అంతటా మరియు తెలంగాణలో ఒక బలమైన భౌతిక మౌలిక సదుపాయాలను రూపొందించడంలో పెట్టుబడి పెట్టింది. నేడు, Amazon ఆరు పెద్ద ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు మరియు 1.75 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ ప్రాసెసింగ్ ప్రాంతాన్ని కలిగి ఉన్న ఒక సార్టేషన్ కేంద్రంతో పాటు దాదాపు Amazon సొంతం చేసుకున్న 70 మరియు భాగస్వామి డెలివరీ స్టేషన్‌లు మరియు 1800 కంటే ఎక్కువ ‘ఐ హావ్ స్పేస్’ స్టోర్‌లను కలిగి ఉంది. Amazon.inలో రాష్ట్రానికి చెందిన దాదాపు 50,000 మంది విక్రయదారులు ఉన్నారు. తెలంగాణకు చెందిన అమ్మకందారులకు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు డెలివరీ చేయడంలో మౌలిక సదుపాయాల పై చేసిన ఈ పెట్టుబడులు సహాయపడుతున్నాయి మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి.
ఇటీవల Amazon.in రియల్మీ నర్జో మద్దతు చేసిన ‘ఎక్స్ ట్రా హ్యాపీనెస్ డేస్’ ను ప్రకటించింది. గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ తో ప్రముఖ బ్రాండ్స్ నుండి శ్రేణుల్లో కొత్త ఉత్పత్తులను కొనడానికి కస్టమర్స్ కు అవకాశం లభిస్తుంది. స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్స్, గేమింగ్ అంశాలు, పెద్ద ఉపకరణాలు, ఆడియో ఆరేగోయం & పర్శనల్ కేర్ ఉత్పత్తుల యొక్క విస్తృత శ్రేణి ఎంపిక పై విక్రేతలను నుండి ప్రత్యేకమైన డీల్స్ మరియు ఆఫర్స్ ను అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘ఎక్స్ ట్రా హ్యాపీనెస్ డేస్’ ను తెచ్చింది. రియల్మీ, ఎన్ విడియా, హైర్, పెడిగ్రీ, ఫెరారో, హర్షీస్, ప్యాంపర్స్, జేబీఎల్, జిల్లెట్ నుండి విస్తృత శ్రేణి ఉత్పత్తులు పై కస్టమర్స్ ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా పొందుతారు.
డిజిట్ సహకారంతో Amazon.in, “స్మార్ట్ ఫోన్ జీనీ” ప్రోడక్ట్ ఫైండర్ ను (మొబైల్ యాప్ యూజర్స్ కోసం అనుభవం ప్రత్యక్షంగా మాత్రమే ఉంటుంది) కూడా పరిచయం చేసింది. ఇది ఒక కొత్త ఇంటరాక్టివ్ విజెట్, కస్టమర్స్ అవగాహనతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడంలో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఇది సులభం చేస్తుంది, తమ విలక్షణమైన అవసరాలకు అనుగుణంగా సరైన స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయడాన్ని నిర్థారిస్తుంది. స్మార్ట్ ఫోన్ జీనీతో, సరైన ఫోన్ ను కనుగొనడం సులభమైంది, నాలుగు –స్టెప్స్ ప్రక్రియ క్రమబద్ధీకరణకు ధన్యవాదాలు
Discussion about this post