వరద సాయం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ వాసులను మోసం చేశారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నారు. ఇటీవల వర్షాల కారణంగా నగరంలోని ముంపు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రజల ఇబ్బందులు తమ పార్టీ మాత్రమే అర్థం చేసుకుందని ప్రభుత్వం తరుపున వారిని ఆదుకుంటామని బాధిత ప్రజలకు పది వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 355 కోట్లు నగరంలో వివిధ డివిజన్‌లలో పంపిణీ చేశారు.
ఇప్పటి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు అసలైన తిరకాసు బయటపడింది. అసలైన బాధితులకు కాకుండా తెరాస పార్టీకి చెందిన వారికే, అధికార పార్టీకి నేతలకు కొమ్ముకాసే నేతలకే పంపిణీ చేశారు అనేది బొగట్టా. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న బాధితులు తమకు వరదసాయం అందలేదని, తమకు తగిన న్యాయం చేయాలని రోడ్డెక్కారు. ప్రభుత్వం విడుదల చేసిన 550 కోట్లు ఏ మూలకు కూడా సరిపోయోలా లేవని గ్రహించిన సీఎం… వెంటనే గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో భాజపా నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు భాజపా వరద సాయాన్ని అడ్డుకుంటుదని కమలం పార్టీపై ఆరోపణలు చేశారు. కేంద్రానికి బండి సంజయ్ లేఖ రాసి వరద సాయాన్ని ఆపేశారని ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ తన సంతకాన్ని సీఎం కేసీఆర్ ఫోర్జరీ చేశారని పేర్కొన్నారు. తను ఈ లేఖ రాయలేదని , నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే పాతబస్తీ చార్మినార్ దగ్గర గల భాగ్యలక్ష్మీ దేవలయం దగ్గర ప్రమాణం చేద్దామని కేసీఆర్‌కి సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనేక ఉద్రిక్తతల నడుమ బండి సంజయ్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్దకు చేరుకున్నారు. తన సవాల్ స్వీకరించని సీఎం… పక్క తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని రుజువైందన్నారు. ఇలా నగర ప్రజలకు మోసం చేసిన తెరాసకు ఓట్లు వేయవద్దని ఈ సంధర్భంగా పిలుపినిచ్చారు సంజయ్.
.

Discussion about this post