మోడీ సర్కారు అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి మీద అన్నదాత ఆగ్రహిస్తున్నాడు. దుర్మార్గమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందిగా సుదీర్ఘకాలంగా హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వానికి బుద్ధివచ్చేలా.. తీవ్రమైన కార్యచరణలోకి దిగాలని యోచిస్తున్నాడు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. తమ డిమాండ్లపై కేంద్రం దిగి రాకుంటే గనుక.. 16 రాష్ట్రాలకు విద్యుత్తు సరఫరా చేసే లైన్‌లను కట్ చేస్తామని హెచ్చరించారు. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం లేదని, వ్యాపారులే సర్కారును నడుపు తున్నారని విమర్శించారు.
రాకేష్ టికాయత్ ప్రకటన ఆగ్రహంతో కూడుకున్నదే కావొచ్చు గాక.. 16 రాష్ట్రాలకు విద్యుత్తు లైన్లను కత్తిరించయడం అన్నది ఆచరణలో ఎంత మేరకు సాధ్యమన్నది తర్వాతి సంగతి.. అయితే.. అన్నదాతలు అన్నంత పనీ చేస్తే గనుక.. సగానికి పైగా దేశం చీకటి అలముకుంటుందన్నది మాత్రం నిజం. ఇప్పటిదాకా ఎంతో శాంతియుతంగా, సంయమనంతో పోరాటాలు చేస్తున్న రైతులు దారి తప్ప, ప్రత్యక్ష కార్యచరణకు దిగకముందే ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించాలని పలువురు భావిస్తున్నారు.
.

Discussion about this post