వారాహి విజయ యాత్ర బహిరంగ సభ అనంతరం ముమ్మిడివరం పట్టణంలోని మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలో అడుగుపెట్టారు. ఇంఛార్జ్ గదిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇంఛార్జ్ పితాని బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post