• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

జగన్ ముందరి కాళ్లకు బంధం వేసిన పవన్ కల్యాణ్

admin by admin
November 13, 2021
0
జగన్ ముందరి కాళ్లకు బంధం వేసిన పవన్ కల్యాణ్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ పెద్ద సవాలునే విసిరారు. విశాఖ ఉక్కు ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా తన పార్టీగత రాజకీయ అనుబంధాలను కూడా లెక్కచేయకుండా తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు బంతిని జగన్మోహన్ రెడ్డి కోర్టులోకి నెట్టారు.

దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం ఆదివారం తిరుపతిలో జరగనున్న నేపథ్యంలో, ఆ వేదిక మీద ఈ సమస్యను ప్రస్తావించాలని, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తేవాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రికి సూచిస్తున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడానికి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముఖ్య వేదికగా ఉపయోగపడుతుందని జనసేన భావిస్తోంది. ఆదివారం తిరుపతిలో జరిగే ఈ సమావేశంలో.. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే భావోద్వేగంతో ఈ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముడిపడి ఉందో, 32 మంది ప్రాణ త్యాగాలతో ఈ పరిశ్రమను ఎలా సాధించుకున్నదీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియచేయాలని, ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి  సద్వినియోగపరచుకోవాలని నాదెండ్ల మనోహర్ కోరారు.

సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానాన్ని కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసుకోవాలని, అక్కడ అన్ని పక్షాలతో తమిళనాడు ప్రభుత్వం చర్చించిందని ఆయన తెలియజెప్పారు. అదే తరహాలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూసేందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతగా ముందుకురావాలని సూచించారు.

కేంద్రం ఇష్టానికి వ్యతిరేకంగా ఒక డిమాండ్ ను హోంమంత్రి అమిత్ షా ఎదుట పెట్టేంత చొరవ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపణ అయింది. ఇలాంటి నేపథ్యంలో ఆదివారం నాటి సమావేశం సందర్భంగా.. ముఖ్యమంత్రి ముందరికాళ్లకు బంధం వేసేలా పవన్ కల్యాణ్ దళం తమ గళం వినిపించడం విశేషం.

Tags: jaganmohan reddyjanasenani pawan kalyanpawan kalyanpawan supports vizag steelvizag steelజనసేనాని పవన్ కల్యాణ్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply