అగ్రగామి టెక్నాలజీ బ్రాండ్, తెలంగాణలో మొబైల్ యూజర్లకు ప్రాధాన్య పూరిత ఆపరేటర్ అయిన జియో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలతో సహా 850 కి పైగా ప్రాంతాల్లో జియో ట్రూ 5జి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తన వినియోగదారులకు అత్యుత్తమ ట్రూ 5జి అనుభవాలను అందించడం పట్ల జియోకు గల కట్టుబాటును చాటిచెప్పడంలో ఈ సేవల ఆవిష్కారం ఒక మైలురాయిగా నిలిచింది.
ఈ అన్ని ప్రాంతాల్లోనూ జియో 1 Gbps+ దాకా అపరిమిత డేటాను వినియోగదారులకు జియో వెల్ కమ్ ఆఫర్ ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఇక్కడి కీలక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశా లు, విద్యాసంస్థలు, మాల్స్, మార్కెట్లు, నివాస ప్రాంతాలు, హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, ప్రభుత్వ భ వనాలు, ఇతర ముఖ్యమైన వాణిజ్య సంస్థల్లో జియో ట్రూ 5జి నెట్ వర్క్ అందుబాటులో ఉంటుంది. అంతే గాకుండా, ఈ నగరాలు, పట్టణాలకు చేరువలో ఉండే పలు గ్రామాలు కూడా జియో ట్రూ 5జి కనెక్టివిటీతో లబ్ధి పొందనున్నాయి.
ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కె సి రెడ్డి మాట్లాడుతూ, ‘‘తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలు సహా 850 ప్రాంతాల్లో జియో ట్రూ 5జి సేవలను విస్తరించినందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాము. తెలంగాణలోని మొబైల్ యూజర్లకు జియో ప్రాధాన్య పూరిత ఆపరేటర్, అత్యంతగా అభిమానించే టెక్నాలజీ బ్రాండ్ గా ఉంటోంది. తెలంగాణ ప్రజలు మరీ ముఖ్యం గా యువత పట్ల జియో కొనసాగిస్తున్న నిబద్ధతకు నిదర్శనం ఈ నెట్వర్క్ విస్తరణ’’ అని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధానకేంద్రాలు, 850 పైగా ప్రాంతాల్లో ట్రూ 5జి సేవలను అందించిన మొదటి సర్వీస్ ప్రొవైడర్‌గా జియో గొప్పగా గర్విస్తోంది. జియో ట్రూ 5జి కవరేజ్ వేగవంతమైన విస్తరణ అనేది సాంకేతిక పరివర్తన ప్రభావాన్ని బలోపేతం చేయడం, ఈ ప్రాంతం అంతటా జియో వినియోగ దారులకు ప్రయోజనాలను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
2023 డిసెంబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తాలూకాలో ట్రూ 5జి సేవలను ప్రారంభించాలనే ఆకాంక్షాపూరిత ప్రణాళికలను జియో కలిగిఉంది. ఈ దేశవ్యాప్త విస్తరణ జియో ట్రూ 5జి నెట్‌వర్క్ అసమా నమైన సామర్థ్యాలతో వినియోగదారులను శక్తివంతం చేస్తుంది, తద్వారా వారు అధునాతన సాంకేతికత పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేలా చేస్తుంది.
సాంకేతికంగా జియో ట్రూ 5జి మూడు రెట్లు ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఇవే అంశాలు జియో ని భారతదేశంలోని ఏకైక ట్రూ 5జి నెట్ వర్క్ గా విశిష్టత సాధించేలా చేసింది. మొదటిది, ఇది 4జి నెట్‌వర్క్‌పై ఆధార పడకుండా, స్వతంత్ర 5జి ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తుంది. రెండవది, జియో 700 MHz, 3500 MHz మరియు 26 GHz బ్యాండ్‌లలో 5G స్పెక్ట్రమ్ అతిపెద్ద మరియు ఉత్తమ మిశ్రమాన్ని పొందింది. చివరగా, క్యారియర్ అగ్రిగేషన్ ఈ 5జి ఫ్రీక్వెన్సీలను సజావుగా మిళితం చేసి, మొత్తం కనెక్టివిటీ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
జియో ట్రూ 5G ని ప్రవేశపెట్టడం తెలంగాణలో సంచలనం సృష్టించనుంది. ఎందుకంటే ఇది కొత్త, వినూత్న సేవలకు వీలు కల్పిస్తుంది, ఆర్థిక వృద్ధిని పెంచుతుంది, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది.
.

Discussion about this post