• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 23, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

సంపాదకీయం : రిజర్వేషన్లకు స్వచ్ఛంద గుడ్ బై!

admin by admin
May 23, 2026
0
సంపాదకీయం : రిజర్వేషన్లకు స్వచ్ఛంద గుడ్ బై!

ఈ ఆలోచన ప్రస్తుతానికి ఎక్కడా ప్రతిపాదన దశలో కూడా లేదు. విద్యా ఉద్యోగావకాశాల్ని, ప్రమోషన్లను కూడా దక్కించుకోవడానికి ‘రిజర్వేషన్’ ఒక అదనపు అర్హతను కల్పిస్తున్నప్పుడు.. ఆ వెసులుబాటు ఉన్నవారికి.. ప్రత్యేకంగా ఎడ్వాంటేజీ ఏర్పడుతున్నప్పుడు.. దానిని స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధపడడం మిథ్య కదా! ‘ఆ ఊహ ఎంత బాగుందో..’ అని రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి, లేదా, రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఉండాలని కోరుకునే వారికి అనిపించవచ్చు. ప్రభుత్వం అలాంటి ఏర్పాటుచేస్తే ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని అనిపిస్తోంది.

రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఆవశ్యకతను తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మరోసారి తెలియజెబుతున్నాయి. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ లు అయినప్పటికీ.. తనకు బీసీ రిజర్వేషన్ కావాల్సిందేనని పట్టుబట్టిన ఒక కన్నడ యువకుడు.. సుప్రీం దాకా తన పోరాటాన్ని తీసుకువెళ్లడం వలన ఈ అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. క్రీమీలేయర్ ఊసు లేకుండా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఇలా రిజర్వేషన్లను ఇస్తూపోతే.. ఆ ఏర్పాటు ద్వారా ఆశించిన ప్రయోజనం.. వెనుకబడిన కులాల్లోనూ అందరూ అభివృద్ధిలోకి రావాలనేమ బృహత్ సంకల్పం ఎప్పటికీ నెరవేరదు.. అనే అభిప్రాయాన్ని సుప్రీం న్యాయమూర్తులు వ్యక్తం చేశారు.

క్రీమీలేయర్ కోవకు చెందే వారికి రిజర్వేషన్ హక్కులను మినహాయించడం 1992 నాటి చారిత్రాత్మక ఇంద్రసాహ్నీ కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అమల్లోకి వచ్చింది. ఈ క్రీమీలేయర్ ను అమలు చేసే విషయంలో- ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాలు రకరకాలుగా తమకు తోచిన రీతిలో అమలుచేస్తున్నాయి. అలాగే.. ఎస్సీ ఎస్టీ వర్గాలకు క్రీమీలేయర్ వర్తించకుండా కూడా చేశారు. ఆ వర్గాల వెనుకబాటుతనం కేవలం ఆర్థికమైనది కాదని, సామాజికమైనది కూడా అనే వాదనతో ఈ నిర్ణయం జరిగింది. ఆ మాటకొస్తే సామాజికపరమైన వెనుకబాటుతనం, వివక్ష లాంటి దుర్మార్గాలకు ఎట్రాసిటీ చట్టం వంటి ఏర్పాట్లు ఉన్నాయి. వాటిని కావలిస్తే మరింత బలోపేతం చేయవచ్చు. కానీ విద్యా ఉద్యోగావకాశాల్లో క్రీమీలేయర్ మంచిదేననే అభిప్రాయం కూడా ఉంది.

ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం గమనించాలి. పార్టీల లోలోపలి ఆలోచనలు, దృక్పథాలు ఎలా ఉన్నప్పటికీ.. వారు ఓట్లకోసం ప్రజల వద్దకు వెళ్లాలి. ఓటు బ్యాంకు రాజకీయాలు వారికి తప్పనిసరి. ఇలాంటి స్థితిలో అన్ని వర్గాల్లోనూ క్రీమీలేయర్ అనే ఫిల్టర్ ను అమల్లోకి తీసుకురావడం ఈ దేశంలో ఎప్పటికీ జరగని పని. అందుకు మెరుగైన ప్రత్యామ్నాయంగా.. రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలనే ఆప్షన్ ను దేశవ్యాప్తంగా కేంద్రం అందుబాటులోకి తీసుకురావొచ్చు.

గ్యాస్ అనుభవం గుర్తుచేసుకుందాం..

గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన తర్వాత సిలిండరు ధరపై వినియోగదారులకు కేంద్రప్రభుత్వం గతంలో సబ్సిడీ ఇస్తుండేది. క్రమక్రమంగా ఆ సబ్సిడీని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక దశ వరకు తగ్గించిన తర్వాత.. గ్యాస్ వినియోగదారులు స్వచ్ఛందంగా తమ సబ్సిడీ సదుపాయాన్ని ఉపసంహరించుకోవచ్చునని కేంద్రం ఆప్షన్ ఇచ్చింది. గ్యాస్ డీలర్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా సబ్సిడీ వద్దని చెప్పే వెసులుబాటు ఇచ్చారు. దేశంలో కోట్లాది కనెక్షన్లకు సబ్సిడీ స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఈ అనుభవాన్ని మనం ఓసారి గుర్తు చేసుకోవాలి.

తమ కుటుంబంలో రాబోయే తరాల్లో ఎవ్వరికీ వర్తించకుండా రిజర్వేషన్ వదులుకోవడం అనేది, గ్యాస్ సబ్సిడీని వద్దనుకున్నంత ఈజీ కాదు. కానీ స్పందన ఉండదనే అనుమానంతో అసలు ప్రయత్నమే చేయకుండా ఉండడం కరెక్టు కాదు. క్రీమీలేయర్ అనే ఫిల్టర్ మరింత విస్తృతంగా అమలులోకి రావాలంటే.. ఇలాంటి స్వచ్ఛందంగా వదులుకునే ఆప్షన్ రావాలి. తరతరాలుగా రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతూ.. సమాజంలో మహా సంపన్నులుగా, ఉన్నత హోదాల్లో ఉండేవారు కూడా ఉంటారు. అలాంటి వారికి నిజంగానే.. మనం రిజర్వేషన్ వదులుకుంటే.. మన సామాజికవర్గంలోనే అభాగ్యులైన పేదలకు ఆ అవకాశం అందివస్తుంది కదా.. అనే సదాలోచన కలగవచ్చు. వెయ్యికొక్కరు లేదా లక్షకొక్కరు మాత్రమే అలాంటి ఆలోచనతో స్పందిస్తారని అనుకుందాం. మార్పుకు అది శ్రీకారం అవుతుంది.

కులమతాల పరంగా ఇప్పటి నవీనతరపు సమాజంలో మనం అనేక భిన్న పోకడలను గమనిస్తుంటాం. ‘నాకు మతం కులానికి సంబంధించిన గుర్తింపు ఇష్టంలేదు’ అని అధికారికంగా ప్రకటించుకుని ‘నో క్యాస్ట్, నో రిలిజయన్’ వ్యక్తులుగా బతకడానికి కూడా చట్టపరమైన ఏర్పాటు మన దేశంలో ఉంది. అలాంటి వారి సంఖ్య బహుస్వల్పం అయినప్పటికీ అది క్రమంగా పెరుగుతోంది. ఇలా జరుగుతూ ఉంటే.. కులరహిత సమాజం ఏర్పడాలనే అంబేద్కర్ ఆశయం మరో వందేళ్లకో, వెయ్యేళ్లకో సాకారం అవుతుందేమో. అలాంటి సమాజాన్ని కోరుకునే వారిలో ఆశావహ దృక్పథాన్ని నింపే పరిణామాలు ఇవి. ఇలాంటి ఉదంతాలు బయటకు వచ్చాక.. ఒకరిని చూసి మరొకరు స్వచ్ఛందంగా ‘నో క్యాస్ట్, నో రెలిజియన్’ బాట పడుతున్నారు కూడా.

రిజర్వేషన్లను స్వచ్ఛందంగా వదులుకునే వెసులుబాటు కల్పిస్తే కూడా ఇలాంటి స్పందన రావొచ్చు. అతి కొద్దిమంది ఇలాంటి పనిచేసినా.. వారిని చూసి మనం కూడా వదులుకుంటే బాగుంటుంది.. మన కుటుంబం, మన పిల్లలు ప్రతిభలతో ఉన్నతస్థానాలకు ఎదగగల వాతావరణం మనం సృష్టించగలిగాం.. అని ఆత్మవిశ్వాసంతో స్పందించే వర్గాలు పెరగవచ్చు. ఏమో.. ఏదో ఒక నాటికి రిజర్వేషన్ వర్గాల్లో నిరుపేదలకు ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాల్లో మెరుగైన అవకాశాలు ప్రాప్తించవచ్చు.

‘రిజర్వేషన్లను తొలగించాలి’ అన్ని అగ్రవర్ణాలనుంచి తరచుగా డిమాండ్ వినిపిస్తుంటుంది. కానీ..సామాజిక అసమానతలు ఇంకా ప్రబలంగా ఉన్న సువిశాల భారతదేశంలో ఆ డిమాండ్ ఆవేశపూరితమైనదే తప్ప సహేతుకమైనది కాదు. అలాగని.. వెనుకబడిన కులాలకు పరిమితంగా ఉండే రిజర్వేషన్లను.. ఆయా వర్గాలనుంచి సంపన్నులు మాత్రమే తన్నుకుపోతూ ఉంటే.. అటు కులాలపరంగానూ ఆర్థికంగానూ కూడా వెనుకబడిన వారు ఎప్పటికి ముందువరుసలోకి వస్తారు. ఆ కోణంలో చూసినప్పుడు ఇది మంచి ఏర్పాటు అవుతుంది.

ఎస్సీలలో రిజర్వేషన్ అవకాశాలు ఎక్కువగా మాల వర్గం వారే దక్కించుకుంటున్నారనే వాదననుంచి పుట్టిన పోరాటం వల్లనే.. ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ అమల్లోకి వచ్చింది. మాదిగ వర్గానికి కొంత అదనపు ఎడ్వాంటేజీ వచ్చింది. ఎస్టీలలో కూడా అనేక కులాల మధ్య ఇలాంటి అసంతృప్తులు ఉన్నాయి. ఎస్టీ రిజర్వేషన్లను అత్యధికంగా లంబాడీలే దక్కించుకుంటున్నారని, గోండులు ఇతర వర్గాలకు చెందిన వారి వరకు దక్కడం లేదనే ఆవేదనను తెలంగాణలో పలు ఆదివాసీ ప్రాంతాల్లో గమనించాను. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎరుకల, యానాది వర్గాలకు దక్కినంత ఎడ్వాంటేజీ ఇతర ఎస్టీ వర్గాలకు దక్కడం లేదనే వాదన ఉంది. ఇన్ని మడత పేచీలు ఉన్నప్పుడు.. పలు తరాలలో రిజర్వేషన్ ను వాడుకుంటూ ఆర్థికంగా సామాజికంగా బలపడిన కుటుంబాలు.. కనీసం స్వచ్ఛందంగా రిజర్వేషన్ వదులుకునే ఏర్పాటు తెస్తే.. వెనుకబడిన వర్గాలకు అపరిమితమైన మేలు కలుగుతుంది.

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు

Tags: creamy layer in reservationseditorialka muni suresh pillaisupreme court
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply