కిసాన్ రైల్.. అనంత అన్నదాతకు వరం

62

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం అన్నదాతకు అండగా నిలవాలని సంకల్పించారు. ఇక్కడి ఉద్యాన రైతులు తమ దిగుబడులను మంచి మార్కెట్ ధరకు అమ్ముకునే వీలు కల్పించడానికి ఢిల్లీవరకు వెళ్లేలా కిసాన్ రైలును సాధించారు. దేశంలోనే ఇది రెండో కిసాన్ రైలు. ఈ రైలు వల్ల తమ దిగుబడులకు మంచి ధరలు లభిస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో చీనీకాయల పంట చాలా ఎక్కువ. పెద్ద రైతులు తమ దిగుబడులను తామే సొంతంగా లారీల్లో అనువైన మార్కెట్ ఉన్న చోటకు తరలించుకుంటారు. కానీ చిన్న, సన్నకారు రైతులకే ఇబ్బంది. తక్కువ మోతాదులో ఉండే తమ పంటకోసం విడిగా లారీ మాట్లాడుకోలేరు. అలాగని తడిసిమోపెడయ్యే రవాణా వ్యయాలను భరించలేరు. ఇలాంటి నేపథ్యంలో కిసాన్ రైలు రూపేణా వారికి వరం లభించిందనే అనుకోవచ్చు.

Facebook Comments