ఏ రోజైతే… కొండాసురేఖ టికెట్ వ్యవహారాన్ని కేసీఆర్ పెండింగ్ లో పెట్టారో… ఆ రోజే కొండా దంపతులు తెరాసను వీడడం ప్రజల దృష్టిలో కన్ఫర్మ్ అయిపోయింది. ఆమెకు వేరే గత్యంతరం లేదని.. కాంగ్రెస్ పార్టీలోనే చేరబోతున్నారని కూడా అంతా అనుకున్నారు. తనను లూప్ లైన్ లో పెట్టినఘట్టం పూర్తయిన తర్వాత.. కొండా సురేఖ ఇప్పటికి మూడు ప్రెస్ మీట్లు నిర్వహించారు. మధ్యలో కుటుంబంతో కలిసి విహారాల నిమిత్తం విదేశీయాత్రకు కూడా వెళ్లివచ్చారు. తాను తెరాసను వీడిపోతున్నట్లుగా ఫక్తు లాంఛనంగా మారిన ప్రకటన చేయడానికి కొండా సురేఖ ఏకంగాఇన్ని రోజుల వ్యవధి ఎందుకు తీసుకున్నారంటే.. ముహూర్తాలుకుదరలేదనే పలువురు అనుకుంటున్నారు.
ఇన్నిరోజులు గ్యాప్ తీసుకుని ఆమె ఇప్పుడు పార్టీనివీడడానికి ముహూర్త బలం ముఖ్యంగా ఉందని పలువురు అంటున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరడం గురించి.. ఇంకాముహూర్తం నిర్ణయించుకోలేదు. కానీ కాంగ్రెస్ లో చేరడంవల్ల తమకుటుంబంలో ఎందరికి టికెట్లు ఇవ్వాలి అనే విషయాన్ని మాత్రం సురేఖ ముందుగానే మాట్లాడుకున్నారని తెలుస్తోంది.
.
Discussion about this post