• About Us
  • Contact Us
  • Our Team
Monday, August 24, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

లోపలి మాట : సంసిద్ధతే కార్యసిద్ధి!

admin by admin
August 28, 2021
0
లోపలి మాట : సంసిద్ధతే కార్యసిద్ధి!

ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమృద్ధిగా ఉన్నా మనిషిలో అసంతృప్తి ఆనవాళ్ళు కనిపించడానికి కారణం కీర్తి కాంక్షే. నలుగురిలో గొప్పగా ఉండాలని, అందరూ తనను గుర్తించాలని ప్రతి మనిషి తాపత్రయపడతాడు.

కీర్తికాంక్ష కోసం చేసే ప్రయత్నంలో కొందరు సఫలీకృతులవుతారు. మరికొందరు విఫలీకృతులవుతారు. సఫలీకృతులైనవారు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నామని కమ్మనైన కథలు చెబితే, విఫలీకృతులైనవారు కొందరి చేతుల్లో విధివంచితులైనామని వివిధ కారణాలు చెబుతారు…

అసలు అపజయానికి కారణం ప్రయత్న విరమణే. ఏదైనా సాధించాలని చేసే ప్రయత్నంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతాయి. వాటికి భయపడి వెనకడుగు వేసి ప్రయత్నాన్ని విరమించుకుంటే అంతటితో అభివృద్ధి ఆగిపోతుంది. అలాకాకుండా ఒడిదొడుకులకు ఎదురేగి, ఆటుపోట్లను ఎదురీదుతూ ముందుకు వెళితే ఎవరెస్టు శిఖరానైనా అధిరోహించగలం.

deviprasad obbu columnistలక్ష్యసాధనలో అపజయ పాలైనవారందరూ ప్రయత్నం విరమించినవారే అనడానికి సాక్ష్యంగా నాకు తెలిసిన చిన్ననాటి మిత్రుడొకడున్నాడు.

అతని పేరు శంకర్. మంచి పాటకారి. వాడు ఎప్పుడూ ‘భక్త కన్నప్ప’ సినిమాలోని “శివశివ శంకర భక్తవ శంకర” అనే పాట పాతుండేవాడు. ఆ పాట పాడేటప్పుడు వీధిలో వెళ్ళేవాళ్ళు కూడా ఆగి పాటను పూర్తిగా విని వినోదించేవారు. అంత మధురంగా ఉంటుంది వాడి కంఠస్వరం. వాడు ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. అది వాడికి పుట్టుకతోనే వచ్చిన విద్య. మా వీధిలోని శ్రీరామ మందిరంలో ప్రతి శనివారం రాత్రి ఏడుగంటలకు భజన కార్యక్రమం జరిగేది. ఆ భజనలో శంకర్ పాడే పాటలే ప్రధాన ఆకర్షణ. వాడు పాడే పాటలను వినడంకోసమే వీధిలోని చిన్నా, పెద్దా కలిసి యాభైమంది వరకు వచ్చేవారు మందిరం వద్దకు. వాడి యొక్క ప్రతిభను చూసి… “ఒరేయ్ శంకరా! పాటలు ఇంత మధురంగా పాడుతున్నావు కదా. సినిమాల్లోకి వెళ్ళరా. మంచి భవిష్యత్తు ఉంటుంద”ని మా వీధిలో వాళ్ళు చాలామంది సలహాలు ఇవ్వడంతో వాడు సినిమా చాన్సులకోసం హైదరాబాదు వెళ్ళాడు. తీసుకెళ్ళిన డబ్బులు మూడు మాసాల వరకు వచ్చాయి. అయినా సినిమా చాన్సు తగలలేదు. ఇంటికొస్తే అవమానమని హోటల్లో సర్వరుగా చేరాడు. హాటల్లో పనిచేస్తూనే సినిమా ప్రయత్నాలు చేశాడు. ఏదో ఒక ప్రయత్నంలో సినిమా పాట కోరస్ బృందంలో ఒకడుగా చాన్సు తగిలింది. ఇంట్లో వాళ్ళు ఎంతో సంతోషించారు. అలా రెండు, మూడేళ్ళు కోరస్ బృందంలో చాన్సులు తగిలాయిగాని, మెయిన్ సింగరుగా పాడే అవకాశం మాత్రం రాలేదు. మెయిన్ సింగరుగా చాన్సులు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు శంకర్ వద్ద డబ్బులు తీసుకుని సినిమా చాన్సు ఇప్పించకుండా మోసం చేశారు. దాంతో విసిగిపోయిన శంకర్ సినిమా ప్రయాత్నాలు ఆపేసి హోటల్లో పనిచేయడం ఇష్టంలేక ఇంటికొచ్చేశాడు. అంతటితో వాడి ప్రతిభ మరుగునపడిపోయింది. వాడు హైదరాబాదు నుంచి వచ్చిన తర్వాత ఉన్న ఊళ్ళో కూడా హోటల్లోనే సర్వరుగా చేరడం విశేషమే అయినా విషాదకరం.

అలాగే…

లక్ష్యసాధనలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా లెక్కచేయకుండా, కష్టాలనే ఇష్టాలుగా భావించి, అన్నిటికీ సిద్ధపడి, ప్రయత్నాలు చేస్తూనే అనుకున్నది సాధించిన మరొక చిన్ననాటి మిత్రుడొకడున్నాడు.

అతని పేరు పాపయ్య. పాపయ్యకు చిన్నతనం నుంచి నాటకాల పిచ్చి. ఏ పాత్రనైనా అవలీలగా చేసే సామర్థ్యం ఉన్న మంచి నటుడు పాపయ్య. పౌరాణిక నాటకాలతోపాటు సాంఘిక నాటకాలలోని పాత్రలు కూడా వేసేవాడు. ఆ నైపుణ్యంతోపాటు తనకున్న ఆసక్తి కారణంగా ఎవరు చెప్పకపోయినా సినిమాలో నటించాలని హైదరాబాదు వెళ్ళాడు. వెళ్ళిన మూడు సంవత్సరాలైనా ఏ సినిమా అవకాశమూ దక్కలేదు. కానీ, అధైర్యపడకుండా అప్పుడప్పుడు నాటకోత్సవాలు జరిగే ప్రదేశాలకు వెళ్ళేవాడు. తనకున్న చొరవ గుణంతో నాటకోత్సవాలు ప్రదర్శించేవారిని మెప్పించి అవకాశాలు చేజిక్కించుకుని నాటకాలలో నటించేవాడు. ఆ నాటకాలలో నటించడం ద్వారా వచ్చే డబ్బులు ఏ మాత్రం సరిపోయేదికాదు. అయినా వెనకడుగు వేయకుండా హైదరాబాదులోనే ఉండి చిన్నచిన్న పనులు చేసుకుంటూ, నాటకాలలో నటిస్తూ, తిన్నాతినకపోయినా సినిమా ప్రయత్నాలు మాత్రం అపలేదు. అలా మరో రెండేళ్ళ నిరీక్షణ తర్వాత సినిమా అవకాశం దక్కింది. పాత్ర చిన్నదయినా తన అసమాన ప్రతిభ కారణంగా వెంటనే మరో రెండు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందరికీ గుర్తించిపోయే నటుడు కాకపోయినా చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కున్నాక పెళ్ళి చేసుకుని హైదరాబాదులో స్థిరపడ్డాడు. ఇప్పటివరకు దాదాపు డెభై సినిమాలలో నటించాడు. అలా పాపయ్య అవిశ్రాంత ప్రయత్న పోరాట పటిమతో తన కల సాకారం చేసుకున్నాడు.

కాబట్టి…

మన లక్ష్యసాధనలో అవాంతరాలు, ఆటుపోట్లు, ఒడిదొడుకులు, కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా అధైర్యపడకుండా అన్నిటికీ సిద్దపడి వాటిని ఎదురీదుతూ నిరంతరం లక్ష్యం వైపు అడుగులు వేస్తే తప్పకుండా మన ఆశలు,ఆకాంక్షలు సిద్ధిస్తాయి.

…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.

Tags: deviprasaddeviprasad obbulopalimataఒబ్బు దేవీ ప్రసాద్లోపలిమాట
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply