శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చిత్తూరుజిల్లా కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య మాట్లాడుతూ భారత దేశానికి రాజ్యాంగం గుండెకాయ వంటిదని, ప్రపంచ దేశాల్లోకి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన దేశానికి అంబేద్కర్ రాశారని విద్యార్థులకు తెలిపారు.
అనంతరం సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయులు నాదెండ్ల మురళి ఆధ్వర్యంలో పిల్లలచే సాంఘిక శాస్త్ర ప్రయోగ ప్రదర్శనలు అకట్టుకోగా , పిల్లలచే రూపొందించిన మాక్ పార్లమెంట్ అబ్బురపరచింది. విద్యార్థులు వారి వారి పాత్రల్లో స్పీకర్ ను ప్రశ్నలు అడిగిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
అనంతరం ప్రయోగ ప్రదర్శన, వ్యాసరచన, వక్తృత్వ, చిత్ర లేఖన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
Discussion about this post