అసలే ఖాకీ.. ఆపై తాగి ఉన్నాడు.. అంతకంటే పైగా చేతిలో తుపాకీ కూడా ఉంది. అసలే అర్ధరాత్రి సమయం ఇక చెప్పేదేముంది. చెలరేగిపోయాడు. గన్ చూపించి బెదిరిస్తూ.. జనాన్ని భయపెట్టాడు. హల్చల్ చేసాడు. వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వరంగల్ నగరంలో గోపాలస్వామి గుడి ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి తుపాకీతో ఓ వ్యక్తి హల్చల్ చేసాడు. ప్రజలను బెదిరించాడు.
సదరు వ్యక్తిని,తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే పోలీసులు వ్యవహారాన్ని గుట్టుగా ఉంచారు. సదరు వ్యక్తి ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ గా గుర్తించినట్లు తెలుస్తోంది.
.