చంద్రగిరిలో ఇసుక తరలింపు సమస్యాత్మకంగా తయారైంది. ఇటీవల 30 ఎడ్ల బండ్లను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో వివాదం చెలరేగింది.
దీంతో సమస్యలకు పరిష్కారం చూపేందుకు ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి పాత ఎంపీడీవో కార్యాలయంలో ఎడ్ల బండ్ల యజమానులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జెడ్పీటీసీ యుగుంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక రవాణాకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు.
స్మశానవాటికలు, బ్రిడ్జిలు, కల్వర్టులు, వంతెనలు వద్ద ఇసుక తరలించడం ద్వారా భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రమాదాలు చోటుచేసుకుంటాయని అన్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు మండల వ్యాప్తంగా ఉండే బ్రిడ్జిలు, వంతెనలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు.
రెవెన్యూ అధికారులతో చర్చించి ఇసుక తరలింపునకు పాయింట్ చూపించడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో కో-ఆష్షన్ సభ్యుడు ఔరంగజేబు, ఐతేపల్లి మాజీ సింగిల్ విండో ఛైర్మన్ అగరాల దేవారెడ్డి, వైసీపీ నాయకులు కొత్తపేట హరి తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post