ఆకాశవాణి ఏటా నిర్వహించే జాతీయ సర్వభాషా కవిసమ్మేళనానికి 2023 సంవత్సరానికిగాను తెలుగు భాష నుంచి ఎమ్వీ రామిరెడ్డి ఎంపికయ్యారు. భారతీయ భాషలకు సంబంధించి 23 మంది కవుల కవితల్ని ఆకాశవాణి ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని రంగ్ భవన్‌లో రికార్డు చేయనుంది.
స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్వీ రామిరెడ్డి రాసిన ‘అమృతోపనిషత్’ కవితను తెలుగు భాష నుంచి ఎంపిక చేశారు. ఈ కవితను అన్ని భారతీయ భాషల్లోకీ అనువదించి ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం చేయనున్నారు.
కవిగా, కథా రచయితగా ఎమ్వీ రామిరెడ్డి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటిదాకా 3 కథా సంపుటాలు, 4 కవితాసంపుటాలు ప్రచురించారు.
ప్రస్తుతం రామ్‌కీ ఫౌండేషన్ ప్రెసిడెంటుగా హైదరాబాదులో పని చేస్తున్నారు. తన స్వగ్రామం గుంటూరు జిల్లా పెదపరిమిలో తండ్రి స్మృత్యర్థం స్థాపించిన ‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్టు’ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అదే గ్రామంలో ప్రత్యేకంగా నిర్మించిన భవనంలో వృద్ధాలయంతోపాటు నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు.
Discussion about this post