నగరి రూరల్ మండలం నంబాకం ఎంపీటీసీ సెగ్మెంట్లో మంగళవారం ఉప ఎన్నిక జరుగుతున్నది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
ఈ ఎంపీటీసీ పదవికోసం టిడిపి కి చెందిన ఏలుమలై రెడ్డి, వైసిపి తరఫున గుణ శేఖర్ రెడ్డి అభ్యర్థులుగా బరిలో ఉన్నారు.
ఈ సెగ్మెంట్లో రామకృష్ణాపురం లో 793 ఓటర్లు, అగరంలో 1398 మంది ఓటర్లు ఉన్నారు. ఇద్దరు అభ్యర్థుల మధ్య ఎన్నిక పోటాపోటీగా జరుగుతోంది.
రెండు బూత్ లలో ఎలక్షన్ ప్రక్రియ ఇద్దరు CI ల పర్యవేక్షణలో ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
.