నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకం. దుబ్బాకలో తెరాస ఓడిపోతే.. రఘునందన్ రావు మీద సానుభూతి అన్నారు. గ్రేటర్ లో పరాభవం పాలైతే.. నగర ఓటర్లలో తెరాసకు ఆదరణ లేకపోవచ్చు అన్నారు. ఇప్పుడు సాగర్ తీర్పు వచ్చాక ఏం చెబుతారు?
ఇక్కడ కూడా ఓడిపోతే.. తెరాస రాష్ట్రవ్యాప్తంగా చతికిలపడుతున్నట్టే అనుకోవాలి. అదే సమయంలో మిగిలిన రెండు పార్టీలకు కూడా ఇది కీలకం. బీజేపీ బలం నిజమేనా, కాంగ్రెస్ బలహీనత నిజమేనా? అనేది ఈ ఎన్నికల్లో తేలుతుంది. అలాగే జానారెడ్డి , తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలోకి వెళ్లదలచుకుని కూడా.. ఎలా కాంగ్రెసులోనే ఇరుక్కుపోయారో.. కూడా ఈ ఎన్నికలు తేల్చబోతున్నాయి.
సీనియర్ జర్నలిస్టు క్రిష్ణ సాయిరాం విశ్లేషణ చూడండి :