కొవిడ్ మహమ్మారి ప్రపంచంలో ఎంతటి భయోత్పాతాన్ని సృష్టించిందంటే.. వేక్సిన్ రాగానే.. పలుదేశాల్లో దేశాధిపతులే మొట్టమొదట దాన్ని వేయించేసుకున్నారు. వేక్సిన్ అందుబాటులోకి రాగానే.. అందరికంటె ముందు తాము సురక్షితంగా ఉండడం అవసరం అనుకున్నారు. కానీ.. మన ప్రధాని మోడీ అలా కాదు. కొవిడ్ మహమ్మారి తాకిడి పెరిగిన నాటినుంచి.. దేశ వ్యాప్తంగా నిరుపమానమైన సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ వేక్సిన్ వేసిన తర్వాతనే.. తాను వేయించుకుంటానని అన్నారు. తన ప్రాణరక్షణే ప్రజలకంటె ప్రధానం అని ఆయన భావించలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నారు. దేశంలో రెండు స్వదేశీ వేక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇన్నాళ్లవుతున్నా ఆయన వేయించుకోలేదు. ఈలోగా ప్రెవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న చిన్న చిన్న సిబ్బందికి కూడా వేక్సినేషన్ అయిపోయింది. మోడీ మాత్రం తొందరపడకుండా, మాట మీరకుండా ఉండిపోయారు.
దేశంలో సోమవారం నుంచి వృద్ధులకు వేక్సిన్ వేసే ప్రక్రియ మొదలైంది. యాభై ఏళ్లు దాటిన వారికి కూడా వేక్సిన్లు వేయడం ప్రారంభించారు. ఈ రోజునే.. ఏ ప్రమాణాన్ని అయితే దేశానికి నిర్దేశించారో.. ఆ ప్రమాణాలకు లోబడే వయస్సు దాటిన వ్యక్తిగా మోడీ వేక్సిన్ వేయించుకున్నారు.
‘ఎయిమ్స్ లో తాను ఫస్ట్ డోస్ వేక్సిన్ వేయించుకున్నాను’ అంటూ.. ప్రధాని నరేంద్రమోడీ తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా COVID-19 కు వ్యతిరేక పోరాటంలో వైద్యులు, శాస్త్రవేత్తలు త్వరితగతిన పనిచేశారంటూ మోడీ కితాబిచ్చారు. భారతదేశాన్ని COVID-19 రహిత దేశంగా చేయడానికి టీకా తీసుకోవడానికి అర్హత ఉన్న వయస్సుగల వారందరూ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని మోడీ తన ట్విటర్ ద్వారా సందేశం ఇచ్చారు.
మోడీకి అభినందనలు
దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టీకాలు ఇప్పటికే కొన్ని కోట్లు వేసినప్పటికీ.. ప్రధాని తొందరపడకుండా.. ఫ్రంట్ లైన్ వారియర్ల మీద గౌరవంతో ఆగినందుకు ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా తయారు చేసిన కోవ్యాక్సిన్ టీకా ను ప్రధాని మోడీ వేయించుకున్నారు. పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేద ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మోడీకి టీకా వేశారు. ఇది మొదటి డోసు వేక్సిన్. దీని తర్వాత రెండో డోస్ వేక్సిన్ కూడా వేయించుకోవాల్సి ఉంటుంది.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
— Narendra Modi (@narendramodi) March 1, 2021
.
Discussion about this post